Breaking News

గుండెపోటుతో చైనా మాజీ ప్రధాని కన్నుమూత

Published on Fri, 10/27/2023 - 08:35

బీజింగ్: చైనా మాజీ ప్రధాని (Premier) లీ కెకియాంగ్‌ (68) కన్నుమూశారు. షాంఘైలో గురువారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రాగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది. 2013 నుంచి మార్చి 2023 వరకు ఆయన చైనా ప్రధానిగా ఉన్నారు. సం‍స్కరణల మేధావిగా పేరున్న కెకియాంగ్‌ను అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తొక్కేశారనే రాజకీయ విమర్శ ఒకటి ఉంది. 

అన్హూయి ప్రావిన్స్‌కు చెందిన ఓ రాజకీయ నేత కొడుకు లీ కెకియాంగ్‌. రాజకీయాల్లో నేతలకు స్వేచ్ఛా నిర్ణయాలు ఉండాలనే కెకియాంగ్‌.. దశాబ్దకాలంగా మాత్రం జిన్‌పింగ్‌ సారథ్యంలోని పార్టీ గీత మీదే నడిచారు. మాజీ బ్యూరోక్రాట్‌ అయిన ఈయన ఆంగ్లంలోనూ అనర్గళంగా మాట్లాడగలరు. ఆర్థిక సంస్కరణలకు అధిక ప్రాధాన్యమిచ్చే విధానాలను ఆయన రూపొందించారు. అయితే హెనాన్‌ ప్రావిన్స్‌లో పనిచేస్తూండగా  అడ్డగోలుగా రక్తదాన శిబిరాల నిర్వహణ, ఫలితంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ కేసులు రికార్డు కావడంతో ఆయన ప్రతిష్ట ఘోరంగా దెబ్బతింది. 

తరువాతి కాలంలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అధికారాలను పరిమితం చేయడం ద్వారా లీ కెకియాంగ్‌ను ఓ కీలుబొమ్మ ప్రధానిగా మార్చేశారని చైనా మేధావులు తరచూ విమర్శిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థుడైన కెకియాంగ్‌ సేవల్ని కరోనా  సంక్షోభం నుంచి బయటపడేందుకు జిన్‌పింగ్‌ వినియోగించుకోలేదని అభిప్రాయపడుతుంటారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)