Breaking News

ఉగ్రవాదాన్ని కెనడా ప్రోత్సహిస్తోంది

Published on Sun, 10/01/2023 - 05:12

వాషింగ్టన్‌: ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యపై నెలకొన్న విభేదాలను భారత్, కెనడా ప్రభుత్వం పరస్పరం చర్చించుకుంటే పరిష్కరించుకోవచ్చునని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. నిజ్జర్‌ హత్య కంటే ఉగ్రవాదాన్ని కెనడా ప్రభుత్వం ప్రోత్సహించడం అత్యంత తీవ్రమైన అంశంగా చూడాలని అన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాదానికి, హింసాత్మక కార్యక్రమాలకు ట్రూడో ప్రభుత్వం అనుమతులిస్తోందని వెంటనే వాటిని నివారించాల్సిన అవసరం ఉందన్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న జై శంకర్‌ వాషింగ్టన్‌లో శుక్రవారం భారతీయ జర్నలిస్టులతో మాట్లాడారు. నిజ్జర్‌ హత్య వెనుక భారతీయ ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణల్ని భారత్‌ గట్టిగా తిప్పి కొట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కచ్చితమైన ఆధారాలుంటే చూపించాలన్నారు. వాటిని పరిశీలించడానికి భారత్‌ సిద్ధంగా ఉందని జైశంకర్‌ చెప్పారు.

‘‘కెనడా ప్రభుత్వం నుంచి భారత్‌ చాలా కాలంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదం, హింసాత్మక కార్యకలాపాలపై వారి ఉదాసీన వైఖరే ఇందుకు కారణం. భారత్‌లో నేరాలు చేసిన ఎందరో కెనడాలో తలదాచుకుంటున్నారు. వారిని అప్పగించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కెనడా ప్రభుత్వం స్పందించడం లేదు. నిజ్జర్‌ హత్యపై ఆధారాలు ఇవ్వకుండా అభాండాలు వేస్తోంది. మేము నాలుగ్గోడల మధ్య లేము. ఏదైనా పరిశీలిస్తాం’’ అని జై శంకర్‌ మండిపడ్డారు. నిజ్జర్‌ హత్య కంటే కెనడా ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అతి పెద్ద సమస్యని దానినే మొట్టమొదట పరిష్కరించుకోవాలని అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)