Breaking News

ఓసినీ వేషాలో..! ఉడుత చేష్టలకు నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్

Published on Sun, 06/04/2023 - 19:48

సాధారణంగా జంతువులు యజమాని దృష్టిని ఆకర్షించడానికి రకరకాల తిక్క పనులు చేస్తుంటాయి. ఇటు.. అటు.. దూకుతుంటాయి. పక్క జంతువులతో ఊరికే గొడవ పడుతుంటాయి. కొన్ని సార్లు దెబ్బతగిలినట్లు యాక్టింగ్ కూడా చేస్తుంటాయి. ఇలాంటి చేష్టలను మన పెంపుడు కుక్కల్లో చూస్తుంటాం. కానీ ఉడుతలు కూడా ఈ కొవలోకి వచ్చేశాయా? అని అనిపిస్తుంది మీరు ఈ వీడియో చూస్తే..! ఇంతకూ ఓ నల్లని ఉడత ఏ చేసిందో తెలుసా..?

ఉడుతలు కూడా యాక్టింగ్ చేస్తాయా? అంటే అవుననే అనాలి. దానికి ఏం అనిపించిందో తెలియదు కానీ ఇంట్లో చీపురుతో కాసేపు ఆటలాడింది. అనంతరం ఆ చీపురును మీద వేసుకుని గది ఫ్లోర్‌పై బోర్లా పడుకుంది. చీపురు దాని పొట్టపై పడి ఉండడంతో.. ఉడుతపై చీపురు పడి గాయపడినట్లుందే అని అనిపించాల్సిందే సదరు వీక్షకునికి. దాని నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చనుకోండి..! ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఉడుత కొంటె చేష్టలకు వ్యూవర్స్ తెగ ఎంజాయ్  చేస్తున్నట్లు కామెంట్ పెట్టారు. (ఫ‍్లైయింగ్ ఉండుత.. లైయింగ్ ఉడుత) 'ఎగిరే ఉడుత.. అబద్దాల ఉడుత' అని మరొకరు కామెంట్ చేశారు. 

ఉడుతలు చాలా చురుకుగా ఉంటాయని ఓ జంతు నిపుణుడు తెలిపారు. నిత్యం ఎగురుతూ, దూకుతూ ఆటలాడుతుంటాయని చెప్పారు. పట్టణాల్లోని గదులు వాటికి చాలా చిన్న ప్రదేశం కావున ఆడుకోవడానికి కావాల్సిన ప్రదేశం ఉండదని అన్నారు. నల్లని ఉడుతలను పెంచడానికి అనుమతి లేదని చెప్పారు. వాటికి ప్రత‍్యేకమైన కేర్ అవసరమని పేర్కొన్నారు. వెటర్నరీ సెంటర్లలో లభించవని తెలిపారు. సాధారణంగా ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో ఉంటాయని చెప్పారు.

ఇదీ చదవండి: వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నీస్ రికార్డ్

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)