Breaking News

అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!

Published on Thu, 11/05/2026 - 07:00

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో సిటీ బ్యాంక్ కార్యాలయ సముదాయంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టాంపా సమీపంలోని బ్రాండన్ ప్రాంతంలో ఉన్న బ్యాంక్ క్యాంపస్‌లో బుధవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మృతుల్లో అనుమానిత షూటర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్ కార్యాలయం భారీగా పోలీసు బలగాలను మోహరించింది. 360 మందికి పైగా డిప్యూటీలను అక్కడికి పంపించింది. భవనాల్లో ఉన్న ఉద్యోగులను అధికారులు బయటకు పంపించారు. ఈ ఘటనను వ్యూహాత్మకంగా జరిపిన దాడిగా భావిస్తున్నట్లు షెరీఫ్ చాడ్ క్రోనిస్టర్ తెలిపారు. భవనంలో తనిఖీలు చేపట్టి ముప్పును తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. స్థానికులకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

కాల్పుల నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. అయితే ఈ ఘటనలో  ఎవరైనా గాయపడ్డారా? అనే విషయం వెంటనే తెలియరాలేదు. బ్రాండన్‌లోని సిటీ బ్యాంక్ క్యాంపస్‌లో మూడు అంతస్తులున్న నాలుగు భవనాలు ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఘటనపై సిటీ గ్రూప్ స్పందిస్తూ.. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు వెల్లడించింది.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)