Breaking News

ఫిలిప్పీన్స్‌ను ముంచెత్తిన వరదలు

Published on Mon, 09/02/2024 - 11:57

మనీలా: ఉత్తర ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. ఉష్ణమండల తుఫాను యాగీ మనీలాకు ఆగ్నేయంగా ఉన్న కామరైన్స్ నోర్టే ప్రావిన్స్‌లోని విన్జోన్స్ పట్టణ తీరాన్ని తాకింది.

వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. పర్వత ప్రాంతాలలో  కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు కామరైన్స్ సుర్ ప్రావిన్స్‌లోని నాగా పట్టణంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన లుజోన్‌లో టైఫూన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను వాతావరణం కారణంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. రాజధానికి సమీపంలో ఉన్న మరికినా నదిలో నీటిమట్టం పెరిగిన దృష్ట్యా స్థానికులను హెచ్చరిస్తూ అధికారులు సైరన్ మోగించారు.

ఉత్తర సమర్ ప్రావిన్స్‌లోని కోస్ట్ గార్డు సిబ్బంది రెండు గ్రామాలకు చెందిన 40 మందిని రక్షించారు. తుఫాను కారణంగా పలు ఓడరేవుల్లో షిప్పింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తుఫాను వాతావరణం కారణంగా పలు దేశీయ విమానాల రాకపోకలను రద్దుచేశారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)