Breaking News

నేపాల్‌లో ప్రకృతి విలయం

Published on Sun, 10/05/2025 - 13:43

కఠ్మాండు/న్యూఢిల్లీ: కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నేపాల్‌లో కనీసం 51 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో కొట్టుకుపోయిన కొందరి జాడ తెలియాల్సి ఉందని ఆదివారం ఉదయం అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో 114 మందిని సహాయక సిబ్బంది కాపాడారన్నారు. నేపాల్‌లోని ఏడు ప్రావిన్స్‌లకు గాను ఐదు ప్రావిన్స్‌ల పరిధిలో రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. 

దీంతో ప్రభుత్వం సోమవారం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. కోషి ప్రావిన్స్‌లోని ఇలమ్‌ జిల్లా ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా ప్రభావితమైంది. రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఈ జిల్లాలో 37 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఇలమ్‌లో కొండచరియ విరిగి ఓ నివాసంపై పడటంతో అందులో నిద్రిస్తున్న కుటుంబంలోని ఆరుగురు చనిపోయారని అధికారులు వివరించారు. ఖొటంగ్, రౌటహట్‌ జిల్లాల్లో పిడుగుపాటుకు ఐదుగురు బలయ్యారు. 

 

ఆదుకుంటాం: మోదీ
నేపాల్‌లో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై భారత ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మిత్ర దేశం నేపాల్‌కు ఎలాంటి అవసరము న్నా ముందుగా స్పందించి ఆదుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉంటుందని ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో నేపాల్‌ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)