భారత్‌ దౌత్యం సక్సెస్‌.. ఇరాన్‌ చెర నుంచి ఐదుగురు రిలీజ్‌

Published on Fri, 05/10/2024 - 11:24

టెహ్రాన్‌: దౌత్యపరంగా భారత్‌కు మరో ఘన విజయం దక్కింది. ఇరాన్‌ స్వాధీనంలో ఉన్న వాణిజ్య నౌక​లో బంధీలుగా ఉన్న ఐదుగురు భారతీయులు ఎట్టకేలకు విడుదలయ్యారు. ఈ మేరకు భారత్‌ ఎంబసీ కీలక ప్రకటన చేసింది.

వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 13న ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్‌ దళాలు ఓ వాణిజ్య నౌకను హైజాక్‌ చేసింది. హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్‌ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి తమ ఆధీనంలోకి తీసుకుంది. సదరు నౌకను ఇరాన్‌ ప్రాదేశిక జలాల్లోకి తరలించారు. ఇక, ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది భారతీయులు కూడా ఉన్నారు.

 

 

ఈ నేపథ్యంలో వీరిని విడిపించేందుకు భారత్‌ విదేశాంగ శాఖ కసరత్తు చేసింది. మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆ మధ్య ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి హుసేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన అభ్యర్థన మేరకు ప్రయత్నాలు ఫలించాయి. దాదాపు నెల రోజుల తర్వాత వీరిలో కొందరికి ఇరాన్‌ విముక్తి కల్పించింది.

ఈ సందర్భంగా భారత ఎంబసీ ట్విట్టర్‌ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా..‘ఎంఎస్‌సీ ఏరిస్‌లోని భారత సిబ్బందిలో ఐదుగురిని విడుదల చేశారు. గురువారం సాయంత్రం వారు స్వదేశానికి బయల్దేరారు. నావికుల విడుదల కోసం భారత ఎంబసీ, కాన్సులేట్‌ చేసే ప్రయత్నాలకు ఇరాన్‌ అధికారుల నుంచి సహకారం లభిస్తోంది అని పేర్కొంది. భారతీయులతో పాటు ఫిలిప్పీన్స్‌, ఎస్టోనియాకు చెందిన మరో ఇద్దరు సిబ్బందిని కూడా టెహ్రాన్‌ నిన్న విడుదల చేసిందని’ చెప్పుకొచ్చింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)