Breaking News

ఘోరం.. డోర్‌ లాక్‌చేసి ఐదు గృహాలకు నిప్పంటించారు..!

Published on Mon, 12/29/2025 - 16:53

బంగ్లాదేశ్‌ హింసతో అట్టుడుకుపోతుంది. అక్కడి హిందువుల టార్గెట్‌గా జరుగుతున్న దాడులు భారత్‌ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఆదేశంలోని మతఛాందస వాదులు అక్కడి ఇద్దరు హిందు యువకులని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన మరవకముందే మరో ప్రమాదం వెలుగు చూసింది. ఫిరోజ్‌పుర్ జిల్లాలో హిందువులకు చెందిన ఐదు గృహాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.

షేక్ హాసీనా బంగ్లాను వీడి భారత్‌లో ఆశ్రయం పొందిన నాటి నుంచి ఆ దేశంలో రాజకీయ అస్థిరత తీవ్రరూపం దాల్చింది. ఇదే అనువుగా భావించిన అక్కడి టెర్రరిస్టు గ్రూపులు, మత ఛాందస సంస్థలు హిందువులే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ హిందు కుటుంబాలపై దాడులు జరిగిన ఘటనలు దాదాపు 71కి పైగా నమోదయ్యాయి. ఈ విషయాలను స్వయంగా బంగ్లాదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకటించింది. అధికారిక నివేదికలే ఇలా ఉన్నాయంటే ఇంకా అనధికార ఘటనల వివరాల సంగతులు ఏలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

అయితే డిసెంబర్ 28 ఆదివారం ముస్లిం సామాజిక వర్గం అధికంగా గల ఫిరోజ్‌పుర్ జిల్లా దుమ్రితల గ్రామంలో ఘోరం జరిగింది. హిందూ సామాజిక వర్గానికి వ్యక్తులకు సంబంధించిన ఐదు ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఐదు ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియలేదు.

ఈ ఘటనకు సంబంధించి బాధితులు మాట్లాడుతూ "మేము ఉదయం లేచే సరికి ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాము. అయితే బయిటినుంచి ఎవరో తలుపులు లాక్ చేశారు. దీంతో వెనుకనుంచి బాంబో ఫెన్సింగ్‌ను తెంపి తప్పించుకోగలిగాం. మా ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు జంతువులు చనిపోయాయి". అని కన్నీటి పర్యంతమయ్యారు.

 

అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న ఫిరోజ్‌పుర్ ఎస్పీ మంజూర్ అహ్మద్ సిద్దీఖీ ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేస్తామని ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ ఘటనపై ఎన్డీటీవీ ప్రతినిధులు ఢాకాలోని బాధితులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.  బాధితులు భయంగా ఉన్నారని ప్రమాద వివరాలను రికార్డింగ్‌లో తెలపాలని కోరగా వారు నిరాకరించినట్లు  పేర్కొన్నారు.
  
 


 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)