Breaking News

తొలిసారి అమెరికాకు సిరియా అధ్యక్షుడు..!

Published on Sun, 11/02/2025 - 16:54

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌- సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా మధ్య భేటీ ముహూర్తం ఖరారైంది. నవంబర్‌ 10వ తేదీన డొనాల్డ్‌ ట్రంప్‌ను సిరియా తాత్కాలిక అధ్యక్షుడు ఆల్‌ షరా  వాషింగ్టన్‌లో కలవనున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.  

సిరియా అధ్యక్షుడు అధికారికంగా అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు రావడం ఇదే తొలిసారి. అంతకుముందు ఎప్పుడూ సిరియా అధ్యక్షుడికి అమెరికా నుంచి అధికారిక ఆహ్వానం  అందలేదు. దీనికి కారణం వారి మధ్య ఉన్న శత్రుత్వమే. ఇరుదేశాల మధ్య గతంలో అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనే పరిస్థితి  ఉండేది.  అయితే డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీనిలో భాగంగానే తమ శత్రు దేశమైన సిరియాకు ఆహ్వానం పంపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

గతంలో అమెరికా-సిరియాల సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉండేవి. సిరియాలోని అంతర్గత యుద్ధం, ఉగ్రవాద సంస్థల ప్రాబల్యం, మానవ హక్కుల ఉల్లంఘనలకు సిరియా పాల్పడుతోందని అమెరికా విమర్శలు చేస్తూ వచ్చింది.  ఆ క్రమంలోనే ఆ దేశంపై కఠినపై ఆంక్షలు విధించింది అమెరికా. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో సిరియాను తమ దారికి తెచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు ట్రం‍ప్‌. అందులో భాగంగానే సిరియా అధ్యక్ష పదవిలో ఉన్న అల్ షరాకు ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ప్రధానంగా ఇజ్రాయిల్‌, ఇరాన్‌, రష్యా వంటి తదితర దేశాలు ఈ భేటీని నిశితంగా గమనించే అవకాశం ఉంది. 

25 ఏళ్లలో తొలిసారి..
ఈ ఏడాది మే నెలలో సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా భేటీ అయ్యారు.  ఇది 25 ఏళ్లలో అమెరికా, సిరియాల మధ్య జరిగిన మొదటి సమావేశం. ఈ సమావేశం తరువాత  సిరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్.

#

Tags : 1

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)