Breaking News

డెమొక్రాట్లను ఆదుకోండి

Published on Sun, 11/10/2024 - 14:58

వాషింగ్టన్‌: ఎన్నికల తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన డెమొక్రాట్లను ఆదుకోవాలని ట్రంప్‌ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ఈ మేరకు సొంతమీడియాలో ఒక పోస్ట్‌ చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని రిపబ్లికన్లను కోరారు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నిధులు సమీకరించిన డెమొకట్రిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ ప్రచార బృందం... ఎన్నికల అనంతరం 2 కోట్ల∙డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలొచ్చాయి. సంపన్న దాతలు, హాలీవుడ్‌ నుంచి డెమొక్రాట్లు మద్దతు కూడగట్టినప్పటికీ, కీలక ఓటరు గ్రూపుల మద్దతును కోల్పోయారని హారిస్‌ క్యాంపెయిన్‌ ప్రధాన ఫండ్‌రైజర్‌ అజయ్‌ జైన్‌ భూటోరియా చెప్పారు.    

ట్రంప్‌కు బైడెన్‌ ఆతిథ్యం 
ట్రంప్‌తో దేశాధ్యక్షుడు బైడెన్‌ సమావేశమవుతారని వైట్‌హౌస్‌ ప్రకటించింది. బైడెన్‌ ఆహా్వనం మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ఓవల్‌ కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమవుతారని తెలిపింది. సమావేశానికి సంబంధించిన అదనపు వివరాలను వెల్లడిస్తామని వైట్‌హౌస్‌ ప్రెస్‌సెక్రటరీ కరీన్‌ జీన్‌ పియరీ ఒక ప్రకటనలో తెలిపారు. కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌ కూడా వైట్‌హౌస్‌కు ఆహా్వనించినట్లు అధికారి ఒకరు తెలిపారు.

 ట్రంప్‌ కొత్త స్టాఫ్‌ చీఫ్‌ సూజీ వైల్స్‌తో బైడెన్‌ స్టాఫ్‌ చీఫ్‌ జెఫ్‌ జియెంట్స్‌ బుధవారం నాటి సమావేశాన్ని సమన్వయం చేశారని ఇరువర్గాలు వెల్లడించాయి. శాంతియుత అధికార బదిలీలో భాగంగా ఎన్నికల తర్వాత కాబోయే అధ్యక్షుడికి, మాజీ అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. అయితే 2020లో బైడెన్‌కు ట్రంప్‌ ఆతిథ్యం ఇవ్వలేదు. అంతేకాదు 2021లో బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి కూడా ట్రంప్‌ హాజరు కాలేదు. ప్రథమ మహిళకు ఆతిథ్యం ఇవ్వడం కూడా వైట్‌హౌస్‌ ఆనవాయితీగా వస్తోంది. 

 

చదవండి: ట్రంప్‌ రాజకీయం.. ఇండియన్‌ అమెరికన్‌ నేత నిక్కీ హేలీకి బిగ్‌ షాక్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)