మొబైల్‌ చూస్తూ జారిపడ్డ ప్రధాని.. తలకు తీవ్ర గాయం

Published on Wed, 07/26/2023 - 17:29

ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రబుకా ప్రమాదానికి గురయ్యారు. మొబైల్‌ ఫోన్‌ చూస్తూ కింద పడిపోవడంతో ఆయన తలకు దెబ్బతగిలింది. దీంతో ప్రధాని చైనా అధికారిక పర్యటనను అనూహత్యంగా రద్దు చేయాల్సి వచ్చిందని ఫిజీలోని చైనా రాయబార కార్యాలయం బుధవారం ప్రకటించింది. కాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి గెంగ్డూలో జరిగే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి ఫిజీ ప్రధాని హాజరు కావాల్సి ఉంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఒక ముఖ్యమైన దౌత్య కార్యక్రమంగా నిలవనుంది.

అయితే తలకు గాయం కావడంతో చైనా పర్యటన అకస్మాత్తుగా రద్దు అయ్యిందని స్వయంగా ప్రధాని వెల్లడించారు. ఫోన్‌ని చూస్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డానని, ఫలితంగా తలకు గాయమైందని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు రాత్రి పర్యటకు రావడం లేదని చైనాకు తెలియజేసినట్లు  పేర్కొన్నారు.  ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. 
చదవండి: మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే!

‘బుధవారం ఉదయం ప్రభుత్వానికి చెందిన కొత్త బిల్డింగ్‌ ప్రవేశ ద్వారం వద్ద మొబైల్‌ చూస్తూ పొరపాటున మెట్లు జారి కిందపడిపోయాను. ఈ ప్రమాదంలో తలకు గాయమైంది. ఇప్పుడే ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాను’ అని పేర్కొన్నారు. ఇక వీడియోలో అతని చొక్కాపై కొద్దిగా రక్తపు మరకలు సైతం కనిపిస్తున్నాయి. దీంతో తలకు దెబ్బ గట్టిగానే తగిలినట్లు తెలుస్తోంది. 

కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత  అధికారిక పర్యటనల కోసం భవిష్యత్తులో చైనా నుంచి ఆహ్వానాలు అందుతాయని రబుకా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పర్యటన రద్దు ఫిజీ, చైనాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)