Breaking News

కాలిఫోర్నియాలో భారీ ప్రకృతి విపత్తు

Published on Thu, 02/19/2026 - 07:09

లాస్‌ఏంజెల్స్‌:  కాలిఫోర్నియా ప్రకృతి ప్రకోపం సృష్టించింది. శక్తివంతమైన భారీ హిమపాతం కాలిఫోర్నియా రాష్ట్రాన్ని ముంచెత్తింది.  ఈ భారీ హిమపాతంలో చిక్కకుని 8 మంది మృత్యువాత పడగా, మరో ఆరుగురు స్కీయర్లను రెస్క్యూ టీమ్‌ కాపాడింది. లేక్‌తాహో సమీపంలోని క్యాజిల్‌పీక్‌ వద్ద భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి.  మృత్యువాత పడిన వారిలో ఏడుగుర మహిళలున్నారు. 1982 తర్వాత అమెరికాలో సంభవించిన అత్యంత ఘోరమైన హిమపాతంగా ఇది నమోదైంది. 

తీవ్ర వర్షాలు, ఉరుములు, గాలులు: లాస్ ఏంజెల్స్ కౌంటీ సహా అనేక ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. పర్వత ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది, రహదారులు మూసివేయబడ్డాయి. I-80 హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. గత సంవత్సరం అగ్నిప్రమాదాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో మట్టి ప్రవాహాలు (mudslides) వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉన్నట్ల తెలుస్తోంది. 

ఇదిలా ఉంచితే, ఈ ఏడాది జనవరిలో న్యూయార్క్‌లో భారీ శీతాకాలపు తుఫాను సంభవించింది. జనవరి 23 నుండి 27 మధ్య సంభవించిన ఈ తుఫానును'వింటర్ స్టార్మ్ ఫెర్న్ గా నామకరణం చేశారు. ఇది గత మూడు సంవత్సరాలలో న్యూయార్క్ నగరం చూసిన అత్యంత భారీ మంచు తుఫానుగా నమోదైంది.

ప్రమాదకరమైన చలి, మంచు కారణంగా జనవరి 23న గవర్నర్ కాథీ హోచుల్ న్యూయార్క్ రాష్ట్రవ్యాప్తంగా డిజాస్టర్ ఎమర్జెన్సీని ప్రకటించారు. జనవరి 25 నాటికి నగరంలో ఒక అడుగు (12 అంగుళాలు) పైగా మంచు పేరుకుపోయింది. ఉష్ణోగ్రతలు -16 డిగ్రీల సెల్సియస్ (3 డిగ్రీల ఫారెన్‌హీట్) కు పడిపోయాయి. ఈ క్రమంలోనే లాగార్డియా విమానాశ్రయం మూసివేయబడగా, వేలాది విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. న్యూయార్క్ లో పలు రైలు మార్గాలు నిలిపివేయబడ్డాయి.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)