Breaking News

సూర్య గ్రహణం ఎఫెక్ట్‌.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు !

Published on Mon, 04/08/2024 - 16:58

వాషింగ్టన్‌: సూర్యగ్రహణం వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అమెరికన్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం(ఏప్రిల్‌ 8) ఉదయం ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2017 సూర్యగ్రహణంతో పోలిస్తే ఈ గ్రహణ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు 31 శాతం దాకా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

దీనికి కారణం 2017లో గ్రహణం పూర్తిగా కనిపించే(ద పాత్‌ ఆఫ్‌ టొటాలిటీ) 70 మైళ్ల విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలోని ప్రాంతాలకు గ్రహణాన్ని చూసేందుకు వచ్చిన వారితో కోటి 20 లక్షల మంది జన సాంద్రత ఏర్పడిందని, సోమవారం ఏర్పడే గ్రహణం 115 మైళ్ల విస్తీర్ణంలో పూర్తిగా కనిపించనుండగా మొత్తం 31.6 మిలియన్ల మంది ఈ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు వచ్చి దీనిని చూస్తారని నాసా అంచనా వేసింది.

అయితే గ్రహణం పూర్తిగా ఉన్న సమయంలో దానిని చూసేందుకు ఎక్కడి వారు అక్కడే ఆగి పోవడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గ్రహణానికి ముందు అది పూర్తిగా కనిపించే ప్రాంతాలకు చేరుకోవడానికి, గ్రహణం తర్వాత సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయే సమయంలో రోడ్లపై ట్రాఫిక్‌ విపరీతంగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

దీంతో ఈ సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి 25 నిమిషాలకు సగటున ఒక ప్రమాదం జరుగుతుండగా, ప్రతి 95 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గత అనుభవాలు చెబుతున్నాయి. 2017 సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కేవలం మూడు పెద్ద నగరాలకు మూడు గంటల దూరంలో పూర్తిగా కనిపించగా ప్రస్తుత సూర్య గ్రహణం కెనడాలోని టొరంటో సహా ఎనిమిది పెద్ద నగరాలకు 3 గంటల ప్రయాణ దూరంలో పూర్తిగా కనిపించనుంది. దీంతో దీనిని వీక్షించేందుకు అబ్జర్వేటరీలకు వెళ్లడానికి రోడ్డెక్కేవారి సంఖ్య భారీగా పెరగనుంది.

కాగా, సంపూర్ణ సూర్యగ్రహణం  ఉత్తర అమెరికాలోని మెక్సికో, అమెరికా, కెనడాల మీద ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో గ్రహణం ప్రభావాన్ని బట్టి పూర్తిగా చీకటి కమ్ముకోనుంది. అయితే భారత్‌లో దీని ప్రభావం లేదు. భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి మంగళవారం తెల్లవారుజామున 2.22గంటల వరకు గ్రహణం ఉంటుంది. 

ఇదీ చదవండి.. నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే.. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)