Breaking News

శృతిమించిన ‘జెన్‌జీ’ నిరసనలు.. మాజీ ప్రధాని భార్యను చంపేశారు

Published on Tue, 09/09/2025 - 18:59

కాఠ్మాండు: నేపాల్ రాజధాని కాఠ్మాండులో జరిగిన ఘోర ఘటన కలకలం రేపుతోంది. ఆందోళన కారులు నేపాల్ రాజధాని కాఠ్మాండూలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్‌ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్‌ ఆందోళనకారుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 

 

సోషల్‌ మీడియా,అవినీతికి వ్యతిరేకంగా జనరేషన్‌ జెడ్‌ చేపట్టిన ఉద్యమంతో ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. మాజీ ప్రధాని కేపీఓలీతో పాటు పలువురు మంత్రులు దేశం విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కాఠ్మాండూలోని డల్లూ ప్రాంతంలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్‌ ఇంటిని ముట్టడించారు. ఖనాల్‌ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్‌ను ఇంట్లో బంధించి, ఇంటికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకున్న రాజ్యలక్ష్మిని కిర్తిపూర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.

మాజీ ప్రధాని ఖనాల్‌ సతీమణి రాజ్యలక్ష్మి మరణంపై రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.జెనరేషన్ జెడ్‌ ఆందోళనలతో నేపాల్‌ ప్రభుత్వం సోషల్‌ మీడియాపై నిషేధం విధించింది. దీంతో పలువురు జెనరేషన్‌ జెడ్‌ ఆందోళనల్ని సోషల్‌ మీడియా వేదికగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ ప్రధాని ఖనాల్‌ సతీమణి రాజ్యలక్ష్మి మరణంపై ‘మానవత్వానికి మాయన మచ్చ’అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)