Breaking News

ఉక్రెయిన్‌ భద్రత కోసం అవసరమైతే  అణ్వాయుధాలు! 

Published on Fri, 03/07/2025 - 06:25

బ్రస్సెల్స్‌: ఉక్రెయిన్‌ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్‌ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో యూరోపియన్‌ యూనియన్‌ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్‌ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది. 

పోలండ్‌తో పాటు లిథువేనియా, లాతి్వయా వంటి పలు బాలి్టక్‌ దేశాలు ఈ ప్రతిపాదనను గట్టిగా సమరి్థంచాయి. యూరోపియన్‌ యూనియన్‌లో అణ్వాయుధ పాటమున్న దేశం ఫ్రాన్స్‌ ఒక్కటే కావడం విశేషం. ఫ్రాన్స్‌కున్న ఈ సానుకూలతను యూరప్‌ భద్రత కోసం ఉపయోగించేందుకు సిద్ధమని బుధవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా మాక్రాన్‌ ప్రకటించారు. దీనిపై లోతుగా చర్చ జరగాలని ఈయూ భేటీలో ఆయన పునరుద్ఘాటించారు. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. మాక్రాన్‌ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైనదని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ అన్నారు. ‘‘శాంతి యత్నాలకు బదులు యుద్ధానికే ఫ్రాన్స్‌ మొగ్గుతోంది. ఉక్రెయిన్‌తో మా యుద్ధం కొనసాగాలనే ఆశిస్తోంది. మాక్రాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు రుజువు’’ అని ఆయన ఆరోపించారు.


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)