Breaking News

ఇరాన్‌కు బిగ్‌ షాక్‌.. ఈయూ సంచలన నిర్ణయం

Published on Fri, 02/20/2026 - 10:38

టెహ్రాన్‌: ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బిగ్‌ షాక్‌ తగిలింది. యూరోపియన్ యూనియన్(EU) ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. దీంతో, ఐఆర్‌జీసీకి చెందిన నిధులు, ఆస్తులు.. ఈయూ సభ్య దేశాల్లో స్థంభించిపోనున్నాయి.

అయితే, 2026 జనవరి 29న యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల మండలి (Foreign Affairs Council) సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)ను EU అధికారికంగా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, పరాగ్వే, ఈక్వడార్, ఉక్రెయిన్ సహా పలు దేశాలు ఇందుకు అనుకూలంగా ఓటు వేయగా.. ఇజ్రాయెల్, అర్జెంటీనా రెండు దేశాలు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో, ఉగ్రవాద సంస్థల జాబితాలోకి ఐఆర్‌జీసీ వెళ్లిపోయింది.

కాగా, ఐఆర్‌జీసీ ఉగ్రవాద సంస్థగా గుర్తింపు కావడంతో దీనికి చెందిన నిధులు, ఆస్తులు ఈయూ సభ్య దేశాల్లో స్తంభింపజేయబడతాయి. అలాగే, ఈయూలోని వ్యక్తులు, సంస్థలు.. ఐఆర్‌జీసీకి ఆర్థిక వనరులు అందించకూడదు. ఇదిలా ఉండగా.. మొత్తం 13 మంది వ్యక్తులు, 23 సంస్థలు ప్రస్తుతం ఈయూ ఉగ్రవాద జాబితాలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈయూ ఉగ్రవాద జాబితాలో ప్రధానంగా అల్‌ఖైదా, ఐసిస్ వంటి అప్రభుత్వ మిలిటెంట్ గ్రూపులు మాత్రమే ఉండేవి. ఐజీఆర్‌ఎసీ చేరడం ద్వారా ఒక దేశానికి చెందిన సైనిక బలగాన్ని ఈయూ ఉగ్రవాద జాబితాలో చేర్చిన మొదటి గ్రూపుగా రికార్డుల్లో చేరింది. మొత్తంగా, ఈయూ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడమే కాకుండా, ఐఆర్‌జీసీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌లను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈయూ, ఇతర దేశాలు విధించిన ఆంక్షలు కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా, సాధారణ ప్రజల జీవితాలను కూడా గణనీయంగా ప్రభావితం చేయనున్నాయి.

IRGC స్థాపన, ఉద్దేశ్యం..
ఐఆర్‌జీసీ 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఏర్పడింది. దీని ప్రధాన లక్ష్యం.. విప్లవాన్ని రక్షించడం, ఇస్లామిక్ వ్యవస్థను కాపాడటం. ఇది నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్‌కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ఇది ఇరాన్‌లో రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో అత్యంత శక్తివంతమైన సంస్థ. ఐఆర్‌జీసీ.. ఇరాక్, లెబనాన్ (హిజ్బుల్లా), సిరియా, యెమెన్, పాలస్తీనా ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇస్తుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో పెద్ద భాగం IRGC నియంత్రణలో ఉంది. మరోవైపు.. అమెరికా దాడి హెచ్చరికల నేపథ్యంలో ఈనెలలోనే IRGC హోర్ముజ్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)