Breaking News

10వేల సంవత్సరాల తర్వాత బద్ధలై..

Published on Mon, 11/24/2025 - 22:07

ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం(Hayli Gubbi ) దాదాపు 10,000 సంవత్సరాల తర్వాత విస్ఫోటనం చెందింది. నవంబర్‌ 23 ఉదయం డనాకిల్ డిప్రెషన్ ప్రాంతంలో ఈ విస్ఫోటనం గుర్తించబడింది. భూమి క్రింద నిశ్శబ్దంగా ఉన్న ఈ షీల్డ్ వోల్కానో నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగసి పడుతూ ఆకాశాన్ని కమ్మేసింది.

టూలూస్ వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ (VAAC) నివేదిక ప్రకారం.. ఇది అత్యంత అరుదైన విస్పోటనం, ఎర్ర సముద్రం దాటి యెమెన్, ఒమాన్ వైపు వోలకనో కదులుతోంది. ఈ ప్రాంతం అత్యంత వేడి, చేరుకోవడం కష్టమైనది. అందువల్ల భూగర్భ పరిశోధకులు ఉపగ్రహ డేటా, వాతావరణ రీడింగ్స్ ఆధారంగా మాత్రమే పరిశీలిస్తున్నారు.

హైలీ గుబ్బి అగ్నిపర్వతం హోలోసీన్ కాలంలో(ఐస్‌ ఏజ్‌ ముగిసిన తర్వాత.. 11,700 సంవత్సరాల కాలం) ఎప్పుడూ విస్ఫోటనం కాలేదని నిర్ధారించుకున్నారు. ఈ విస్ఫోటనం ఆఫ్రికా కొమ్ము ప్రాంతంలో(హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా) దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన అగ్నిపర్వత సంఘటనగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

సల్ఫర్ డయాక్సైడ్ స్థాయిలు పెరగడంతో ఒమన్‌, యెమన్‌ ప్రాంత ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. ఎయిర్‌ క్వాలిటీ వార్నింగ్‌ నేపథ్యంలో శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

కొన్ని మార్గాల్లో విమానాలు మళ్లించబడ్డాయి.  ఉత్తర భారతదేశం వైపుగా దీని ప్రభావం ఉండే అవకాశం నెలకొంది. దీంతో.. భారత విమానయాన అధికారులకు అలర్ట్‌ జారీ అయ్యింది నవంబర్‌ 24న కన్నూర్‌ నుంచి అబుదాబీ వెళ్తున్న ఇండిగో విమానం (6E 1433) అహ్మదాబాద్‌కు మళ్లించబడింది. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)