Breaking News

బికినీ అమ్మాయిల‌తో స్టీఫెన్ హాకింగ్‌

Published on Thu, 02/26/2026 - 16:23

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు ఇరువైపులా బికీనీ ధరించిన ఇద్దరు మహిళలు ఉన్న ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఓ దీవిలోని ఎప్‌స్టీన్ ఎస్టేట్‌లో హాకింగ్ గడిపినట్లు బయటపడింది. చేతిలో కాక్‌టెయిల్‌ పట్టుకుని, సన్ లౌంజర్‌పై పడుకుని ఉన్న హాకింగ్‌ను ఆ మహిళలు పట్టుకుని ఉన్నారు. 'ది ఇండిపెండెంట్' కథనం ప్రకారం.. హాకింగ్‌తో ఉన్న ఆ ఇద్ద‌రు అమ్మాయిలు.. ఆయ‌న‌కు సేవ చేసేవార‌ని తెలిపింది. వారు హాకింగ్‌కు దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సంరక్షకులని.. హాకింగ్‌కు ఉన్న అనారోగ్య కారణాల దృష్ట్యా వారికి 24 గంటల వైద్య సహాయం అవసరం కాబట్టే.. వారు అక్కడ ఉన్నారని వెల్లడించింది.

ఓ సంద‌ర్భంలో హాకింగ్ జ‌లాంత‌ర్గామిలో ప్ర‌యాణించిన‌ట్లు కూడా ఫోటో ఉంది. అండ‌ర్‌ వాట‌ర్ వెస‌ల్‌ను హాకింగ్‌ కోసం ఎప్‌స్టీన్ మార్పులు చేయించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2006లో సెయింట్ థామ‌స్‌లోని రిట్జ్ కార్ల‌ట‌న్ హోటల్‌లో జ‌రిగిన సైన్స్ స‌ద‌స్సు స‌మ‌యంలో ఆ ఫోటో తీసిన‌ట్లు భావిస్తున్నారు. సెయింట్ జేమ్స్ దీవిలో ఉన్న ఎప్‌స్టీన్ రిసార్టును విజిట్ చేసిన 21 మంది శాస్త్ర‌వేత్త‌ల్లో హాకింగ్ కూడా ఒక‌రు. హాకింగ్‌కు చెందిన 250 ఫోటోలు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న‌ట్లు సమాచారం.  

దీనిపై హాకింగ్ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. ఆ ఇద్దరు మహిళలు యూకేకు చెందిన ఆయన దీర్ఘకాలిక సంరక్షకులని తెలిపారు ఆయన ప్రవర్తనపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేసినా తప్పేనంటూ.. ఆరోపణలను కొట్టిపారేశారు. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన  ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో హాకింగ్ పేరు కనీసం 250 సార్లు ప్రస్తావించబడింది. తాజా పత్రాలలో భాగంగా విడుదలైన ఈ ఫోటోలో, హాకింగ్ ఇద్దరు మహిళల మధ్య చిరునవ్వుతో కనిపిస్తున్నారు.

స్టీఫెన్ హాకింగ్‌ జనవరి 8, 1942న ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదివారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాస్మోలజీ (విశ్వాంతరాళ శాస్త్రం)లో పిహెచ్‌డీ చేశారు. 21 ఏళ్ల వయసులో ఆయనకు అరుదైన మోటార్ న్యూరాన్ వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా ఆయన శరీరం పూర్తిగా పక్షవాతానికి గురైంది. మాట్లాడే శక్తిని కోల్పోవడంతో, ఒక ప్రత్యేకమైన వాయిస్ సింథసైజర్ (కంప్యూటర్ సాయంతో మాట్లాడే పరికరం) ద్వారా తన భావాలను పంచుకునేవారు.

హాకింగ్ ప్రధానంగా విశ్వం పుట్టుక, నల్ల బిలాలు (Black Holes), సాపేక్ష సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు. హాకింగ్ రేడియేషన్ (Hawking Radiation) బ్లాక్ హోల్స్ నుండి కూడా వికిరణం (Radiation) వెలువడుతుందని ఆయన నిరూపించారు. దీనినే 'హాకింగ్ రేడియేషన్' అంటారు. విశ్వం ఒక బిందువు నుండి ప్రారంభమైందని (Big Bang Theory) గణితశాస్త్ర పరంగా నిరూపించారు. సామాన్యులకు కూడా సైన్స్ అర్థం కావాలనే ఉద్దేశంతో ఆయన అనేక పుస్తకాలు రాశారు. మార్చి 14, 2018న (ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుట్టినరోజున) హాకింగ్ తన 76వ ఏట కన్నుమూశారు.

 

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు