Breaking News

భారత్‌పై ‘ఎక్స్‌’ పిటిషన్‌

Published on Fri, 03/21/2025 - 04:06

బెంగళూరు: చట్ట వ్యతిరేక కంటెంట్, సెన్సార్‌ షిప్‌ పేరుతో భారత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘ఎక్స్‌’ కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టానికి ముఖ్యంగా సెక్షన్‌ 79(3)(బీ) విషయంలో 2015 నాటి శ్రేయా సంఘాల్‌ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తోందని, ఆన్‌లైన్‌లో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించింది. జ్యుడీషియల్‌ ప్రక్రియకు లోబడి కంటెంట్‌ను బ్లాక్‌ చేయడం లేదా సెక్షన్‌ 69 ఏ ప్రకారం చట్ట ప్రకారం చర్య తీసుకోవాలన్న నిబంధనలను భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొంది.

కాగా, ప్రభుత్వ నోటిఫికేషన్‌ లేదా కోర్టు ఉత్తర్వుతో అక్రమ కంటెంట్‌ను ఆన్‌లైన్‌ వేదికలు తొలగించడం తప్పనిసరని ఐటీ చట్టంలోని 79(3)(బీ) చెబుతోంది. 36 గంటల్లోగా ఆ విధంగా చేయకుంటే, సంబంధిత వేదికలకు సెక్షన్‌ 79(1) ప్రకారం రక్షణలను కోల్పోతుంది. ఐపీసీ తదితర చట్టాల ప్రకారం ఆ వేదికలపై చర్యలు తీసుకునే అవకాశమేర్పడుతుంది. అయితే, ఈ నిబంధనను వాడుకుంటూ స్వతంత్రంగా కంటెంట్‌ను బ్లాక్‌ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నది ఎక్స్‌ వాదన.

తగు ప్రక్రియను అనుసరించకుండా అధికారులు ఏకపక్షంగా కంటెంట్‌ సెన్సార్‌ షిప్‌ విధిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తోంది. అదేవిధంగా, సామాజిక మాధ్యమ వేదికలు, పోలీసులు, దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం కోసం హోం శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన సహయోగ్‌ పోర్టల్‌ను ఎక్స్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. న్యాయపరమైన సమీక్ష లేకుండానే ఫలానా కంటెంట్‌ను తొలగించాలంటూ ‘సహయోగ్‌’నేరుగా తమపై ఒత్తిడి చేస్తోందని కూడా ‘ఎక్స్‌’అంటోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)