Breaking News

ఎక్స్‌ బయో మళ్లీ మార్చిన మస్క్‌

Published on Fri, 02/07/2025 - 06:02

వాషింగ్టన్‌: అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వంలో కీలకమైన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ(డోజ్‌) శాఖకు అధిపతిగా ఉన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మళ్లీ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్‌’లో వివరాలను మార్చారు. ఆయన అకౌంట్‌ తెరవగానే పేరు కింద కొత్తగా ‘‘వైట్‌హౌస్‌ టెక్‌ సపోర్ట్‌’’అనే పదాన్ని చేర్చారు. ప్రపంచ ప్రఖ్యాత సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌ను కొనుగోలుచేసి దానికి ‘ఎక్స్‌’అని పేరు మార్చినప్పటికీ నుంచీ మస్క్‌ ‘ఎక్స్‌’లో క్రియాశీలకంగా పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. 

వైవిధ్యభరితంగా, వివాదాస్పదంగా, నవ్వు తెప్పించేలా పోస్ట్‌లు పెడుతూ సోషల్‌మీడియా వేదికపై ఎప్పుడూ ఫేవరెట్‌గా నిలుస్తున్నారు. అందర్నీ ఎగతాళి చేస్తానని చెప్పుకుంటూ గతంలో తన బయోలో చీఫ్‌ ట్రోల్‌ ఆఫీసర్‌(సీటీఓ) అని రాసుకొచ్చారు. బరాక్‌ ఒబామా కాలంలో యునైటెడ్‌ స్టేట్స్‌ డిజిటల్‌ సర్విస్‌(యూఎస్‌డీఎస్‌)గా మొదలైన అమెరికా ప్రభుత్వ శాఖకు ట్రంప్‌ తాను అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టాక డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ(డోజ్‌)గా పేరు మార్చారు. 

ప్రభుత్వ ఖర్చులను భారీగా తగ్గిస్తూ, కొన్ని శాఖలకు నిధుల అనవసర, అధిక కేటాయింపులను తగ్గిస్తూ, ప్రాధాన్యతగల శాఖలకు కేటాయింపులు పెంచుతూ ఈ డోజ్‌ నిర్ణయాలు తీసుకుని అధ్యక్షుడికి సలహాలు, సూచనలు, సిఫార్సులు చేస్తుంది. డోజ్‌కు ప్రస్తుతం మస్క్‌ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ‘‘యూఎస్‌డీఎస్‌ ఇప్పుడు డోజ్‌గా మారాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకే మార్చాశాం. అమెరికా ప్రభుత్వ కంప్యూటర్‌ వ్యవస్థలన్నింటినీ ఆధునీకరిస్తాం’’అని మస్క్‌ అన్నారు.  

వైట్‌హౌస్‌పై మస్క్‌ కన్ను ! 
‘‘డోజ్‌ విభాగం తెగ పనిచేస్తోంది. వారానికి మేం 120 గంటలు పనిచేస్తున్నాం’’అని గత వారం మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అమెరికా మేగజైన్‌ ‘వైర్డ్‌’సైతం ఇలాగే స్పందించింది. ‘‘వాస్తవానికి మస్క్‌ అక్కడేం చేయట్లేడు. వాషింగ్టన్‌ డీసీలోని డోజ్‌ ప్రధాన కార్యాలయంలో నిద్రపోతున్నాడు’’అని ఒక కథనంలో పేర్కొంది. 

అసలు పనిపై దృష్టి తగ్గించేసి అమెరికా అధ్యక్ష భవనంలో పాగా వేసేందుకు మస్క్‌ ప్రయత్నిస్తున్నాడని వార్తలొచ్చాయి. వైట్‌హౌస్‌లోని వెస్ట్‌ వింగ్‌ అయిన ఓవెల్‌ ఆఫీస్‌లో తన పరపతి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అయితే దీనిపై ట్రంప్‌ స్పందించారు. ‘‘మస్క్, ఆయన బృందానికి వేరే చోట వేరే ఆఫీస్‌ సిద్ధంచేస్తాం. ఆ ఆఫీస్‌ ఓవెల్‌ ఆఫీస్‌లో భాగంగా ఉండబోదు. ఓవెల్‌ ఆఫీస్‌ కేవలం అధ్యక్షుడిగా కార్యనిర్వాహణ ఉత్తర్వులు ఇవ్వడానికే వినియోగిస్తా’’అని ట్రంప్‌ స్పష్టంచేశారు.    

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)