Breaking News

ఆ ఇద్దరి కోసం ట్రంప్‌ సాయం అడిగారు: మస్క్‌

Published on Wed, 01/29/2025 - 09:22

వాషింగ్టన్‌:అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను తీసుకువచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ తన సాయం కోరారని ప్రముఖ బిలియనీర్‌ ఇలాన్‌ మస్క్‌ తెలిపారు. ఇందుకు తమ సంస్థ స్పేస్‌ఎక్స్‌ సాయం చేస్తుందన్నారు. ఈ మేరకు మస్క్‌ మంగళవారం(జనవరి28) ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు. 

గతేడాది జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌,బుచ్‌ విల్మోర్‌లు అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. కేవలం పది రోజులు ఉండడానికి మాత్రమే వారిద్దరు అంతరిక్షానికి వెళ్లారు. అయితే అంతరిక్షానికి వెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో సమస్యలు రావడంతో వారు తిరిగి రాలేకపోయారు. 

బైడెన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇద్దరు వ్యోమగాములు ఇప్పటివరకు అంతరిక్షంలోనే ఉండిపోయారని మస్క్‌ విమర్శించారు.కాగా, సునీత,విల్మోర్‌లను తీసుకురావడానికి నాసా తమ కంపెనీ సాయం కోరిందని మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ గతేడాది ఆగస్టులోనే ప్రకటించింది. ఇందుకుగాను స్పేస్‌ ఎక్స్‌కు చెందిన డ్రాగన్‌ రెండు ఖాళీ సీట్లతో అంతరిక్షంలోకి వెళ్లింది. 

ఇందులో నింగిలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములతో పాటు సునీత,విల్మోర్‌లను కూడా తిరిగి భూమికి తీసుకురావాల్సి ఉంది. అయితే డ్రాగన్‌ రాక కూడా కూడా వాయిదా పడుతూ వస్తోంది.మస్క్‌ తాజా పోస్టుతో సునీత,విల్మోర్‌లు త్వరలోనే భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.    

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)