Breaking News

‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌ ఎక్కడ?’.. ట్రంప్‌పై మస్క్‌ కొత్త దాడి

Published on Wed, 07/09/2025 - 14:04

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్‌ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పార్టీని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌ తాజాగా మరోమారు ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన కీలక  ఫైల్స్‌ను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నదంటూ ఎలాన్‌ మస్క్ అధ్యక్షుడు ట్రంప్‌ను నిలదీశారు.

దీంతో జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ వ్యవహారం తాజాగా అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ట్రంప్ బయటపెట్టకపోతే ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారు?” అంటూ మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తాను కొత్తగా స్థాపించిన అమెరికా పార్టీ అధికారంలోకి వస్తే ఈ కుంభకోణాన్ని బయటపెట్టడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని మస్క్‌ పేర్కొన్నారు.


ఇటీవల అమెరికా న్యాయశాఖ (డీఓజే) జెఫ్రీ ఎప్‌స్టీన్ సంబంధించిన కేసుపై కీలక ప్రకటన చేసింది. ఎప్స్టీన్ నివాసాలలో సోదాలు చేసినా  ఎటువంటి క్లయింట్ లిస్ట్ దొరకలేదని,  ఇకపై ఈ కేసులో ఎలాంటి సమాచారం వెల్లడించబోమని స్పష్టం చేసింది. దీనిపై మస్క్ తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశంలో ఒక విలేకరి ఇదే అంశంపై ట్రంప్‌ను ప్రశ్నించగా, ఆయన  సమాధానాన్ని దాటవేశారు. మీరు ఇంకా ఎప్‌స్టీన్ గురించే మాట్లాడుతున్నారా? అని తిరుగు ప్రశ్నవేశారు.
 

న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ సాగించిన దుర్మర్గాల జాబితాను  గత ఏడాది న్యూయార్క్ న్యాయస్థానం బట్టబయలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేసే ప్రక్రియలో భాగంగా తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు. ఈ కుంభకోణంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల పేర్లతో పాటు మైకెల్ జాక్సన్ తదితరుల పేర్లు బయటికొచ్చాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)