Breaking News

అమెరికాలో ఉద్యోగులకు మస్క్‌ బిగ్‌ షాక్‌..!

Published on Sun, 02/23/2025 - 07:23

వాషింగ్టన్‌:అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) చీఫ్‌‌ ఇలాన్‌ మస్క్‌ పెద్ద షాక్‌ ఇచ్చారు. ఈ మేరకు మస్క్‌ శనివారం(ఫిబ్రవరి22) ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక షాకింగ్‌ పోస్టు చేశారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఫెడరల్‌ ఉద్యోగులందరికీ ఒక మెయిల్‌ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్‌ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్‌కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని బాంబు పేల్చారు. 

 మస్క్‌ తన ట్వీట్‌లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్‌ అందాయి. ఈ మెయిల్‌లో ఐదు బుల్లెట్‌ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం.ఈ మెయిల్‌కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్‌కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. 

మస్క్‌ నేతృత్వంలోని ఉద్యోగుల సంఖ్య తగ్గించడంలో డీవోజీఈ మరింత దూకుడుగా వెళ్లాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించిన గంటల్లోనే ఉద్యోగులకు మెయిళ్ల రూపంలో షాక్‌ తగలడం గమనార్హం. అయితే మస్క్‌ మెయిళ్లపై ఫెడరల్‌ ఉద్యోగుల యూనియన్‌ తీవ్రంగా స్పందించింది. చట్టవ్యతిరేకంగా ఉద్యోగులను తొలగిస్తే కోర్టులో సవాల్‌ చేస్తామని స్పష్టం చేశారు. తాము ఎంతో కష్టపడి ముఖ్యమైన విభాగాల్లో ప్రజలకు సేవ చేస్తుంటే ట్రంప్‌ మరోసారి తమను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)