Breaking News

మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్‌

Published on Sun, 08/24/2025 - 05:30

వాషింగ్టన్‌: సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ రంగంలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్‌ను తలదన్నేలా అధునాతన కృత్రిమమేధ సంస్థ ‘మాక్రోహార్డ్‌’ను ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ పేరులోని మైక్రో, సాఫ్ట్‌ పదాలకు పూర్తి విరుద్ధమైన మాక్రో, హార్డ్‌ పదాలతో మస్క్‌ తన కొత్త కంపెనీకి పేరు పెట్టడం గమనార్హం. మైక్రోసాఫ్ట్‌ కంటే తన సంస్థ అద్భుతంగా ఎదగబోతోందని అర్థంవచ్చేలా గతంలోనే మస్క్‌  Macrohard >>  Microsoft అని ‘ఎక్స్‌’ లో పోస్ట్‌చేసిన విషయం తెల్సిందే. 

ఎక్స్‌ఏఐ సంస్థ సారథ్యంలో ఇకపై మాక్రోహార్డ్‌ సంస్థ పనిమొదలు పెడుతుందని మస్క్‌ శనివారం ప్రకటించారు. ‘‘ఇకపై సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ తదితరాల కోసం విడిగా హార్డ్‌వేర్‌లను కర్మాగారాల్లో తయారు చేయాల్సిన పనిలేదు. ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే కృత్రిమమేధతో పని జరిగిపో తుంది. సాఫ్ట్‌వేర్‌ అనేవి అంతా ఆన్‌లైన్‌లోనే ఇన్‌స్టాల్‌ అవుతాయి. 

ఈ లెక్కన ఒకరకంగా మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్, డివైస్‌లు, ఉపకరణాల విభాగ వ్యాపారం మూలకు పడినట్లే. యావత్‌ సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని ఏఐతో భర్తీచేస్తా. హ్యూమన్‌ స్పీచ్, టెక్స్ట్‌ సహా పరస్పర సమాచార బదిలీని సాధ్యంచేసే చాట్‌బాట్‌ వంటివన్నీ ఇకపై నేరుగా సాఫ్ట్‌వేర్‌తోనే జరిగేలా చేస్తా. ఇది వేలాది మంది శ్రామికులు చేసే పనిలో సమానం. భారీ సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ శ్రామికశక్తిని మా ఏఐ క్లోన్‌ భర్తీచేస్తుంది. మాక్రోహార్డ్‌ అనేది పూర్తిగా ఏఐ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ’’అని మస్క్‌ చెప్పుకొచ్చారు.  

ఒకేసారి సమాంతర వ్యవస్థ 
‘‘ఇకపై వేలాదిగా స్పెషలైజ్డ్‌ కోడింగ్, ఇమేజ్, వీడియోలను సృష్టించే, అర్థంచేసుకునే కంప్యూటర్‌ పోగ్రామ్‌లను అభివృద్ధిచెందించాల్సి ఉంది. ఇవన్నీ ఒకేసారి సమాంతరంగా పనిచేస్తాయి. దీంతో యూజర్లు తమకు కావాల్సిన ఏదైనా సమాచారం, అంశంపై నేరుగా సాఫ్ట్‌వేర్‌తోనే మాట్లాడొచ్చు, సంప్రతించవచ్చు. వర్చువల్‌ మెషీన్లే సాధారణ యూజర్లు అడిగే ఎలాంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో ఇస్తాయి. ఇదంతా ఊహించనంత స్థాయిలో జరగబోతోంది. దీనిని ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ కర్మాగారంగా చెప్పొచ్చు’’అని మస్క్‌ చెప్పారు. 

మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ సంస్థ ఆగస్ట్‌ ఒకటో తేదీన అమెరికా పేటెంట్‌ ఆఫీస్‌లో ‘మాక్రోహార్డ్‌’పేరిట పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసింది. గతంలోనే మస్క్‌ ఏఐ ఆధారిత వీడియోగేమ్స్‌ రంగంలో అడుగుపెట్టాలని భావించారు. ఇప్పుడు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు దశాబ్దాలుగా సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ఉత్పత్తుల రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్‌ ఏకఛత్రాధిపత్యాన్ని కూలదోసేందుకు కొత్త తరహాలో ఏఐ సాఫ్ట్‌వేర్‌ తయారీకి మస్క్‌ నడుంబిగించారు. 

అయితే ప్రతి కంప్యూటర్‌లో కనిపించే మైక్రోసాఫ్ట్‌ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌ వంటి సాఫ్ట్‌వేర్‌లకు దీటుగా అంతకుమించిన సౌకర్యాలుండే అన్ని రకాల సాఫ్ట్‌వేర్‌ సేవలను అందించడం మస్క్‌కు కత్తిమీద సాము చేయడంతో సమానమని సాఫ్ట్‌వేర్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. 

దిగ్గజ ఎన్‌విడియా నుంచి తెప్పించిన లక్షలాది గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌(జీపీయూ)లతో అమెరికాలోని మెంఫిస్‌లో మస్క్‌ ఇప్పటికే భారీ కేంద్రాలను ఏర్పాటుచేసి కొలోసస్‌ సూపర్‌కంప్యూటర్‌లతో పని మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే తరహాలో ఏఐ కంప్యూటింగ్‌ సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు సిద్ధమైన ఓపెన్‌ఏఐ, మెటా వంటి పెద్ద సంస్థలతో మస్క్‌ సంస్థ పోటీపడాల్సి ఉంది.   

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)