Breaking News

వైద్య విద్యపై ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Sat, 08/01/2026 - 08:04

న్యూయార్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ వైద్య విద్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే మూడేళ్లలో ‘ఆప్టిమస్‌’ రోబోలు ఇప్పుడున్న బెస్ట్‌ డాక్టర్ల కన్నా మెరుగైన శస్త్రచికిత్సలు చేయగలని, పెద్దపెద్ద ఆపరేషన్లను కూడా సునాయాసంగా నిర్వహించగలవని వ్యాఖ్యానించారు. అందుకే కొత్తగా వైద్య విద్యలో చేరవద్దని సూచించారు. 

ఎలాన్ మస్క్ చేసిన తాజా వ్యాఖ్యలు వైద్య రంగంలో టెక్నాలజీ ఆధిపత్యంపై తీవ్ర చర్చకు దారితీశాయి. 2029 నాటికి టెస్లా 'ఆప్టిమస్' (Optimus) హ్యూమరాయిడ్ రోబోట్లు మానవ సర్జన్‌ను మించిపోతాయని, ఆ తర్వాత కొద్ది కాలానికే వైద్యులను వెనక్కి నెట్టివేస్తాయని ఆయన పేర్కొన్నారు. కేవలం 12 ఏళ్ల సుదీర్ఘ వైద్య విద్య, శిక్షణ అవసరం లేకపోవడం, అలసిపోకుండా పనిచేయడం, అపరిమితంగా విస్తరించే సామర్థ్యం రోబోట్ల సొంతం. ప్రస్తుతం ఉన్న వైద్యుల కొరత, ఆకాశాన్నంటుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే ఈ మార్పు అనివార్యమని మస్క్‌ అంటున్నారు.

అయితే, ఈ మార్పునకు నిర్దేశించిన కాలపరిమితిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఎలాన్ మస్క్ శైలిలో అత్యంత వేగవంతమైన జోస్యం మాత్రమేనని నిపుణులు భావిస్తున్నారు. వైద్య రంగంలో చట్టపరమైన నిబంధనలు, న్యాయపరమైన బాధ్యతలు, రోగుల నమ్మకం వంటి అనేక వాస్తవిక అడ్డంకులు ఉన్నాయి. 2029 నాటికి ఇది సాధ్యం కావడం చాలా దూలభమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, భవిష్యత్‌లో అత్యుత్తమ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని, నేడు దేశాధ్యక్షులకు లభించే వైద్యం కంటే మెరుగైన సంరక్షణ సామాన్యులకు కూడా దక్కే గమ్యస్థానం వైపు మనం పయనిస్తున్నామని స్పష్టమవుతోంది.

ఈ సాంప్లికా విప్లవంలో కేవలం మాన్యువల్ సర్జరీలపై ఆధారపడే వైద్యులు వెనుకబడే ప్రమాదం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని, రోబోట్లతో కలిసి పనిచేయడం నేర్చుకున్నవారే భవిష్యత్‌లో అసలైన విజేతలుగా నిలుస్తారు. వైద్య వృత్తి పూర్తిగా అంతరించిపోకపోయినా, దాని స్వరూపం మాత్రం పూర్తిగా మారిపోనుంది. మనుషుల నైపుణ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా రోబోటిక్స్ కలయికతో వైద్య రంగంలో సరికొత్త శకం ప్రారంభం కానుంది.
 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)