Breaking News

డోజ్‌ నుంచి వైదొలగను: మస్క్‌

Published on Fri, 04/04/2025 - 01:26

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వ బాధ్యతల నుంచి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డోజ్‌) సారథ్యం నుంచి వైదొలగుతున్నట్లు వస్తున్న వార్తలను టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ ఖండించారు. ‘‘అవన్నీ పుకార్లే. పని పూర్తయ్యేదాకా పదవిలో కొనసాగుతా’’అని ఎక్స్‌ పోస్టులో స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌ కూడా ఈ వార్తలను ఖండించింది. ‘‘అవన్నీ చెత్త వార్తల. పదవీకాలం పూర్తయ్యాకే మస్క్‌ తన బాధ్యతల నుంచి వైదొలుగుతారు. 

మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇద్దరూ ఈ మేరకు గతంలోనే బహిరంగంగా ప్రకటించారు’’అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లివిట్‌ అన్నారు. ట్రంప్‌ అంతర్గత వ్యవహారాల నుంచి మస్క్‌ పూర్తిగా తప్పుకుంటారని ఎవరైనా అనుకుంటే అది వాళ్లను వాళ్లు మోసగించుకోవడమేనని సీనియర్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి ఒకరన్నారు. డోజ్‌ నుంచి మస్క్‌ కొద్ది వారాల్లో తప్పుకుంటారని ట్రంప్‌ స్వయంగా కేబినెట్‌కు తెలిపినట్లు పొలిటికో నివేదిక పేర్కొనడం తెలిసిందే.

 ‘‘ఆయన త్వరలో సొంత వ్యాపారాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. అందుకు ట్రంప్‌ కూడా అంగీకరించారు. మస్క్‌ ఇక అనధికారిక సలహాదారు పాత్ర పోషిస్తారు’’అని చెప్పుకొచ్చింది. జనవరిలో డోజ్‌ బాధ్యతలు చేపట్టిన మస్క్‌ ఫెడరల్‌ వ్యయాలను తగ్గింపు, ప్రభుత్వోద్యోగుల ఉద్వాసనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను సమూలంగా మెరుగు పరచడానికి ఈ చర్యలు అవసరమంటున్నారు. 

ఆయన నాయకత్వంలో డోజ్‌ ఇప్పటికే ప్రభుత్వ కాంట్రాక్టులు, శ్రామిక శక్తిలో భారీ కోతలు పెట్టింది. ఇవన్నీ అంతిమంగా ప్రభుత్వానికి లక్ష కోట్ల డాలర్ల దాకా ఆదా చేయగలవని పలు నివేదికలు అంచనా వేస్తునఆనయి. ప్రత్యేక ప్రభుత్వోద్యోగిగా మస్క్‌ పదవీకాలం మే నెలాఖరుతో ముగియనుందని భావిస్తున్నారు. ఆలోగా ఫెడరల్‌ వ్యయాన్ని లక్ష కోట్ల డాలర్ల మేరకు తగ్గించే పనిని పూర్తి చేయగలనని ఆయన చెబుతున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)