Breaking News

Elon Musk: ఎక్స్‌ మెయిల్‌ వచ్చేస్తోంది !

Published on Sat, 02/24/2024 - 06:02

వాషింగ్టన్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ పేరును ‘ఎక్స్‌’గా మార్చిన దాని నూతన యజమాని, కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అదే పేరుతో ఒక ఈమెయిల్‌ను తీసుకురానున్నారు. ‘ఎక్స్‌ మెయిల్‌’ త్వరలో రాబోతోందని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈమెయిల్‌ సేవల ముఖచిత్రం మారబోతోందని వ్యాఖ్యానించారు. అయితే సొంత ఎక్స్‌మెయిల్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు, అందులోని ప్రత్యేకతలు ఏంటి అనే వివరాలను ఇంకా వెల్లడించలేదు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు నెటిజన్లు అందరూ వాడే గూగుల్‌ వారి జీమెయిల్‌ త్వరలో తన సేవలను నిలిపివేయనుందన్న పుకార్ల నడుమ ఎక్స్‌మెయిల్‌ అరంగేట్రం చేయనుండటం గమనార్హం. జీమెయిల్‌ 2024 ఆగస్ట్‌ ఒకటో తేదీన కనుమరుగుకానుందంటూ ‘ఎక్స్‌’లో ఒక వార్త ప్రత్యక్షమై           విస్తృత చర్చకు తెరలేపింది. గూగుల్‌ పంపిన ఒక ఈమెయిల్‌లో ‘త్వరలో జీమెయిల్‌ అస్తమించబోతోంది’ అంటూ ఒక సందేశం ఉందని ఆ వార్తలోని సారాంశం. దీనిపై జీమెయిల్‌ మాతృసంస్థ గూగుల్‌ స్పందించింది.

‘అవన్నీ శుద్ధ అబద్ధాలు. ఇన్నాళ్లూ బేసిక్‌ హెచ్‌టీఎంఎల్‌ వ్యూ ఫార్మాట్‌లో జీమెయిల్‌ సేవలు అందించాం. ఆ సేవలను ఈ ఏడాది నిలిపివేసి త్వరలోనే ‘స్టాండర్డ్‌’ వ్యూలో జీమెయిల్‌ సేవలను అధునాతనంగా అందిస్తాం’ అని గూగుల్‌ స్పష్టతనిచి్చంది. దీంతో జీమెయిల్‌ యూజర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగా రాబోయే ఎక్స్‌మెయిల్‌ ఏమేరకు జీమెయిల్‌కు పోటీ ఇవ్వగలదో చూడాలి మరి. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని ‘ఎక్స్‌’ ఇంజనీరింగ్, సెక్యూరిటీ టీమ్‌ సీనియర్‌ సభ్యుడు న్యాట్‌ మెక్‌గ్రేడీ వెల్లడించారు. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)