Breaking News

ట్వీట్లకు పరిమితులు

Published on Mon, 07/03/2023 - 06:30

శాన్‌ ఫ్రాన్సిస్కో: సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ వినియోగదారులకు ఆ సంస్థ యజమాని ఎలాన్‌ మస్క్‌ గట్టి షాక్‌ ఇచ్చారు. ప్రతీరోజూ ట్వీట్లను చూడడానికి పరిమితి విధించారు. వెరిఫైడ్, అన్‌వెరిఫైడ్‌ అకౌంట్లకు వేర్వేరు పరిమితులు విధించారు. అన్‌వెరిఫైడ్‌ అకౌంట్‌ యూజర్లు రోజుకి 600 పోస్టులు మాత్రమే చూడగలరని, వెరిఫైడ్‌ ఖాతాదారులు రోజుకి 6 వేల పోస్టులు చూడగలరని శనివారం ఒక ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.

త్వరలో ఈ ట్వీట్ల సంఖ్యను అన్‌వెరిఫైడ్‌ అకౌంట్లకు 800కి వెరిఫైడ్‌ అకౌంట్లకి 8 వేలకు పెంచుతామని చెప్పారు. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ వినియోగదారులకి శనివారం ట్విట్టర్‌ యాక్సెస్‌లోకి రాలేదు. కొందరు ట్వీట్లు చేస్తుంటే కెనాట్‌ రిట్రైవ్‌ ట్వీట్స్, లిమిట్‌ ఎక్సీడెడ్‌ అన్న మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ట్విట్టర్‌ డౌన్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ట్విట్టర్‌ డేటాను చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధతో పని చేసే వ్యవస్థలకి శిక్షణ ఇవ్వడానికి దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే ఈ పరిమితులు వచ్చాయని చెప్పారు.

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)