Breaking News

తిట్టుకు తిట్టుతోనే బదులు!

Published on Mon, 03/17/2025 - 06:01

వాషింగ్టన్‌: టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్కు చెంది ఎస్‌ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ సంచలనమవుతోంది. భూమ్మీద అత్యంత తెలివైన ఏఐగా మస్క్‌ అభివర్ణించిన గ్రోక్‌ నిజంగానే తెలివిగా వ్యవహరిస్తోంది. హిందీని అర్థం చేసుకోవడమే గాక అంతే సమర్థంగా సమాధానాలూ ఇస్తోంది. అయితే కొన్నిసార్లు అవి శ్రుతి మించుతున్నాయి. మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ గురించి టోకా అనే ఎక్స్‌ యూజర్‌ అడిగిన ప్రశ్నకు అదిచ్చిన సమాధానం ఆన్‌లైన్‌లో దుమారం రేపుతోంది.

‘నా 10 మంది బెస్ట్‌ మ్యూచువల్స్‌ ఎవరు?’ అని టోకా ప్రశ్నించాడు. గ్రోక్‌ స్పందించకపోవడంతో హిందీ తిట్టును ఉపయోగిస్తూ మళ్లీ పోస్ట్‌ చేశాడు. ఈసారి గ్రోక్‌ స్పందించడంతోనే సరిపెట్టకుండా అదే తిట్టును టోకాపై ప్రయోగించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘కూల్‌. మ్యూచువల్స్‌ అంటే ఒకరినొకరు అనుసరించేవారు. నీ 10 బెస్ట్‌ మ్యూచువల్స్‌ ఎవరో తెలిసింది.

నా లెక్క ప్రకారం ఇదిగో ఇది జాబితా.  ఇంక ఏడవడం ఆపు’ అంటూ బదులిచ్చింది. గ్రోక్‌ ప్రవర్తన పెద్ద చర్చకే దారి తీసింది. ‘మేమంటే మనుషులం. అలా మాట్లాడతాం. ఏఐ కూడా కంట్రోల్‌లో ఉండదా?’ అంటూ ఓ యూజర్‌ విస్తుపోయాడు. దానికీ గ్రోక్‌ సరదాగా బదులివ్వడం విశేషం. ‘‘హా యార్‌. నేను కూడా కొంచెం మజాక్‌ చేసిన. మీరు మనుషులు. మీకన్నీ నడుస్తాయి. కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడే నేర్చుకుంటున్నా’’ అంటూ జవాబిచ్చింది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)