Breaking News

డబ్బు ఇవ్వడం చట్టవిరుద్ధం

Published on Fri, 10/25/2024 - 05:39

వాషింగ్టన్‌: భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆయుధాలు ధ రించే హక్కుకు మద్దతు పలుకుతూ ఆన్‌లైన్‌ పిటిషన్‌పై సంతకం చేస్తే రోజులో ఒకరికి 10 లక్షల డాల ర్లు ఇస్తానని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ప్రక టించడాన్ని అమెరికా ప్రభుత్వం తప్పుబట్టింది. ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టంచేస్తూ మస్క్ ను అమెరికా న్యాయశాఖ హెచ్చరించింది. 

ఈ మేరకు ఎన్నికల చట్ట ఉల్లంఘనలపై న్యాయశాఖలోని పబ్లిక్‌ ఇంటిగ్రిటీ విభాగం మస్క్ కు చెందిన సూపర్‌ పీఏసీ కంపెనీకి హెచ్చరిక లేఖ ను పంపింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు, ఆయుధా లు ధరించే హక్కుకు మద్దతుగా పిటిషన్‌పై సంతకం చేస్తే ఎన్నికల తేదీదాకా ప్రతి రోజూ ఒక విజే తకు 10 లక్షల డాలర్లు ఇస్తానని మస్క్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన విషయం విదితమే. 

ట్రంప్‌కు మద్దతుగా పలువురు టెక్‌ పారిశ్రామికవేత్తలతో ఏర్పాటైన సూపర్‌ పీఏసీ అనే సంస్థ తమ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. అమెరికా ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే స్వింగ్‌ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నెవడా, అరిజోనా, మిషిగన్, విస్కాన్సిన్, నార్త్‌ కరోలినాలోని ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆన్‌లైన్‌ పిటిషన్‌ కార్యక్రమం దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై సంతకం చేయాలంటే నిర్దిష్ట రాష్ట్రాల్లో రిజిస్టర్డ్‌ ఓటరు అయి ఉండాలనే షరతు విధించారు. 

ఈ షరతుకు లోబడి ఇప్పటివరకు గెలిచిన ఇద్దరు వ్యక్తులకు 10 లక్షల డాలర్ల చెక్కులను అందజేశారు. శనివారం హారిస్‌బర్గ్‌లో ఒకరు, ఆది వారం పిట్స్‌బర్గ్‌లో మరొకరు ఈ చెక్కులను అందుకున్నారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంపై అమెరికాలో నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో డబ్బు ఇవ్వడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తూ హెచ్చరిక లేఖను జారీ చేశారు. అయితే, ప్రభుత్వం పంపిన లేఖపై సంస్థగానీ, ఎలాన్‌ మస్క్ గానీ ఇంకా స్పందించలేదు. అయితే ఓటు వేసే వాళ్లు మాత్రమే ఈ ఆన్‌లైన్‌ పిటిషన్‌లో సంతకం చేయాలనే నిబంధన లేదని, ఏ పారీ్టకి చెందినా, చెందకపోయినా, ఎన్నికల్లో ఓటువేసే ఉద్దేశంలేకపోయినా ర్యాండమ్‌గా విజేతను ఎంపికచేస్తామని మస్క్‌ మరో పోస్ట్‌లో వివరణ ఇవ్వడం గమనార్హం. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)