Breaking News

ఫారో కంకణం కరిగించేశారు! 

Published on Tue, 09/23/2025 - 06:16

కైరో: దాదాపు 3,000 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉండి అలనాటి ఈజిప్ట్‌ ఫారో రాజుల ఘనతను చాటిన స్వర్ణకంకణం చోరీ కథ చివరకు విషాదంగా ముగిసింది. ఈజిప్ట్ లోని ప్రఖ్యాత మ్యూజియంకు సంబంధించిన పునరుద్ధరణ ల్యాబ్‌లో తస్కరణకు గురైన కంకణాన్ని వెతికిపట్టుకునేందుకు రంగంలోకి దిగిన ఈజిప్ట్‌ దర్యాప్తు సంస్థ అధికారులు, పోలీసులుకు చివరకు ముద్ద బంగారమే లభించింది. 

సీసీకెమెరాల లేని ల్యాబ్‌లో కంకణం చోరీకి గురయ్యాక పలువురు అక్రమ పురాతన వస్తువుల డీలర్ల చేతులు మారి చివరకు స్వర్ణకారుల చేతుల్లో పడి కరిగిపోయింది. తొలుత చోరీ చేరిన దొంగ మొదలు చివరిసారిగా కొనుగోలుచేసిన వ్యక్తిదాకా ఎవరికీ దాని చారిత్రక నేపథ్యం, అమూల్యమైన అంతర్జాతీయ మార్కెట్‌ విలువ తెలియదు. దీంతో సాధారణ బంగారు కడియంగా భావించి దానిని కరిగించి ముడి బంగారాన్ని బయటకుతీశారు. 

ఇటలీలో ఒక పురాతన వస్తు ప్రదర్శన కోసం కైరో నగరంలోని తహ్రీర్‌ స్క్వేర్‌లోని ప్రఖ్యాత మ్యూజియం నుంచి ఈ కంకణాన్ని తెప్పించగా సెపె్టంబర్‌ 9వ తేదీన చోరీకి గురైన విషయం తెల్సిందే. క్రీస్తు పూర్వం 1,076 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 723 సంవత్సరాల కాలంలో ఈజిప్ట్ ను పరిపాలించిన రాజవంశానికి చెందిన అమేనీమోప్‌ ఫారో రాజుకు చెందిన ఈ కంకణంను అమేనీమోప్‌ ఆన్‌ఆర్‌టీ–4 ఛాంబర్‌లో గతంలో కనుగొన్నారు. మధ్యలో లాపిస్‌ లజూలీ మణిపూస పొదిగిన ఈ కంకణం అత్యంత అరుదైంది. చోరీ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. చేతులు మారిన నగదునూ స్వా«దీనంచేసుకున్నారు.

అసలేమైంది? 
భద్రంగా ‘సేఫ్‌’లో దాచిన కంకణాన్ని ల్యాబ్‌లో పునరుద్ధరణ పనులు చూసే ఒక మహిళా నిపుణురాలు దొంగలించింది. ఆమె కైరోలోని ఒక వెండి దుకాణం యజమానికి అత్యల్ప ధరకు విక్రయించింది. దీనిని ఆ వెండి దుకాణదారు మరో బంగారం దుకాణం యజమానికి కేవలం 3,800 డాలర్లకు విక్రయించాడు. దీనిని అతను 200 డాలర్ల లాభానికి అంటే 4,000 డాలర్లకు మరో బంగారం దుకాణయజమానికి అమ్మేశాడు. ఇతను కంకణాన్ని కరిగించి వచి్చన బంగారంతో తన కస్టమర్లకు కావాల్సిన స్వర్ణాభరణాలు చేసి ఇచ్చి డబ్బు సంపాదించాడు. కంకణం కోసం బయల్దేరిన పోలీసులకు కంకణానికి బదులు ఈ నలుగురు నేరస్తులు చిక్కారని ఈజిప్ట్‌ పర్యాటక, పురాతత్వ శాఖ మంత్రి షెరీఫ్‌ ఫతీ చెప్పారు.

 ‘‘కంకణం మాత్రమే కాదు ఈజిప్ట్ లో మరెన్నో చారిత్రక వస్తువులకు సరైన భద్రత లేదు. మ్యూజియంలలో సీసీటీవీలు సరిగా పనిచేయవు. రక్షణ ఏర్పాట్లను పటిష్టంచేయకపోతే అమూల్యసంపద ఇలాగే అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది’’ అని ఈజిప్ట్‌ మహిళా పురాతత్వవేత్త మోనికా హనా ఆవేదన వ్యక్తంచేశారు. ఈమె ఈజిప్ట్‌ నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోయి అక్కడి మ్యూజియంలలో ప్రత్యక్షమైన పలు వస్తువులను తిరిగి తీసుకొచ్చేందుకు ఉద్యమిస్తున్నారు. ఈమె అరబ్‌ అకాడమీ ఫర్‌ సైన్స్, టెక్నాలజీ, మారిటైమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యూనివర్సిటీలో డీన్‌గా సేవలందిస్తున్నారు.  

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)