Breaking News

కారుని ఆపగా..డ్రైవింగ్‌ సీటులో కుక్క!..కంగుతిన్న ట్రాఫిక్‌ పోలీసులు

Published on Wed, 05/17/2023 - 17:16

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు రకరకాల ఎత్తుగడలు పన్నడం గురించి విన్నాం. మహా అయితే నేరాన్ని వేరే వారిపై లేదా సాక్ష్యాధారాలు మార్చడం వంటివి చేస్తారు. అంతేగాని జంతువులపై నెపం నెట్టడం చూడటం అరుదు. పట్టుపడకుండా ఉండేలా జంతువుని బుక్‌ చేసిన వ్యక్తి బహుశా అతడేనేమో. అతన చేసిన పనికి పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ వింత ఘటన యూఎస్‌లోని కొలరాడోలో చోటే చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని కొలరాడో రోడ్డుపై కారు ఓ మాదిరి స్పీడ్‌తో వస్తుంది. ఇంతతో ఓ రహదారి వద్ద ట్రాఫిక్‌ పోలీసులు ప్రతి వాహనదారుడిని చెక్‌ చేస్తున్నారు. ఆ క్రమంలో ఓ కారు వారి వద్దకు వస్తుండటం గమనించి ఆపారు. కామన్‌గా పోలీసులు ఆపిన వెంటనే సదరు వ్యక్తులు కారుదిగి రావడం జరుగుతుంది. ఐతే ఇక్కడ కారు ఆపినా ఎవరూ బయటకు రాకుండా అలానే ఉండటంతో పోలీసులు ఒక్కసారిగా ఏం జరుగుతుందా అని అనుమానం కలిగింది. దీంతో పోలీసులు కారు వద్దకు నేరుగా వచ్చి చూడగా..డ్రైవింగ్‌ సీటులో కూర్చొన్న కుక్కను చూసి ఒక్కసారిగా పోలీసులకు ఊపిరి ఆగినంత పనిఅయ్యింది.

ఈ కారుని కుక్కే డ్రైవ్‌ చేసుకుని వచ్చిందా అంటూ అయోమయంగా చూస్తుండిపోయారు. కాసేపటికి వారు కారుని పరికించి చూడగా ప్యాసింజర్‌ సీటులో ఉన్న ఓ వ్యక్తిని గమనించి వెంటనే పోలీసులు ఆరా తీశారు. ఐతే ఆ వ్యక్తి తాను డ్రైవ్‌ చేయలేదని బుకాయించాడు. ఆ తర్వాత పోలీసలు తమదైన శైలిలో అడగగా సీట్లు మార్చుకున్నట్లు తెలిపాడు. అతను డ్రింక్‌ చేశాడేమనన్న అనుమానంతో పరీకించగా తాగిన సంకేతాలు కనబర్చాడు.

అంతే అతను అరెస్టు నుంచి తప్పించుకోవాలని పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఐతే పోలీసులు అతడినికి కేవలం 20 గజాల దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ కుక్కను జంతువుల సంరక్షణాధికారి పర్యవేక్షణలో ఉంచి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తాను పట్టుపడకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు పోలీసులు ఎదుట అంగీకరించాడు. 

(చదవండి: దేశం దాటి ప్యాసింజర్లకు సారీ చెప్పిన ఎయిర్‌లైన్స్‌ అధినేత)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)