Breaking News

ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌

Published on Sun, 03/01/2026 - 12:06

ప్రతీకారానికి దిగకపోవడం ఇరాన్‌కు మంచిదంటూ ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రతీదాడులు చేస్తే మరింత తీవ్ర పరిణామాలు  తప్పవన్నారు. మరోవైపు, ఇరాన్‌ కూడా దీటుగా బదులిస్తోంది. అమెరికా హద్దు మీరిందని.. మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొంది. యూఎస్‌పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామంటూ ఇరాన్‌ హెచ్చరించింది.

సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణాన్ని ధృవీకరించిన అనంతరం ఇవాళ (ఆదివారం) ఉదయం ఇరాన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ తన 'ట్రూత్ సోషల్‌ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ హత్యకు నిరసనగా ఇరాన్‌ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్‌ దాడులతో అమెరికా అప్రమత్తమైంది. ఇరాన్‌ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేపట్టింది. ఖమేలీ మృతిపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్‌ స్పష్టం చేసింది.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారంటూ ట్రంప్‌ నిన్న(శనివారం) ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖమేనీని చరిత్రలో అత్యంత దుష్టులలో ఒకరిగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు.. అమెరికన్లకు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు.

 

#

Tags : 1

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)