Breaking News

త్వరలో ట్రంప్‌-పుతిన్‌ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం?

Published on Mon, 03/17/2025 - 08:28

వాషింగ్టన్‌ డీసీ: రష్యా- ఉక్రెయిన్‌(Russia-Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వారంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మీడియాతో మాట్లాడుతూ రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి నిబంధనల దిశగా అమెరికా అధక్షుడు ట్రంప్‌ యోచిస్తున్నారన్నారు. గత వారం పుతిన్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, యుద్ద నియంత్రణకు పరిష్కారాలు లభించాయని అన్నారు. కాగా పుతిన్ డిమాండ్లలో కుర్స్క్‌లో ఉక్రేనియన్ దళాల లొంగిపోవడం కూడా ఉందా అని ఆయనను మీడియా అడిగినప్పుడు..దానిని ధృవీకరించేందుకు ఆయన నిరాకరించారు.

వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. అయితే శాంతి ఒప్పందం కుదిరే ముందు పలు అంశాలపై చర్చలు జరపాల్సి ఉందన్నారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్.. అమెరికా నుండి ఎటువంటి భద్రతా హామీని పొందబోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఘోర అవమానం

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)