Breaking News

పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంపై ట్రంప్‌ విమర్శలు

Published on Tue, 07/30/2024 - 09:46

వాషింగ్టన్‌: పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చాలా అవమానకరంగా జరిగాయని విమర్శించారు. ప్రముఖ చిత్రకారుడు లియొనార్డో డావిన్సీ గీసిన ‘లాస్ట్‌ సప్పర్‌’ పెయింట్‌ స్ఫూర్తితో చేసిన ప్రదర్శన ఓ వర్గం విశ్వాసాలను కించపర్చేటట్లు ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించే ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే, ఒలింపిక్స్‌ నిర్వాహకులు మాత్రం ఏ మతాచారాలను ఉద్దేశించి ఆ ప్రదర్శన చేయలేదని వివరణ ఇచ్చారు. 

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చాలా ఓపెన్‌గా మాట్లాడే మనస్తత్వం నాది. ఏదిఏమైనా పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలోని కార్యక్రమాలు అవమానకంగా ఉన్నాయి’’ అని అన్నారు.

 

ట్రంప్‌ తిరిగి  అధ్యక్షుడిగా ఎన్నికైతే.. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌ను ఎలా నిర్వహిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..  పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ప్రారంభోత్సంలోని ‘లాస్ట్ సప్పర్‌’ వంటి కార్యక్రమాన్ని మాత్రం  చేయమని అన్నారు. పారిస్‌ ప్రారంభోత్సవంలో లాస్ట్ సప్పర్‌ను గుర్తుచేసే విధంగా కనిపించిన నృత్యకారులు, డ్రాగ్ క్వీన్స్, డీజే భంగిమలలో కూడిన సన్నివేశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా చేసిన ట్రంప్‌ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)