Breaking News

బంగ్లాదేశ్‌కు ట్రంప్‌ బిగ్‌ షాక్‌

Published on Sun, 01/26/2025 - 19:09

వాషింగ్టన్‌: బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ షాకిచ్చారు. బంగ్లా ప్రభుత్వానికి అమెరికా సాయాన్ని రద్దు చేస్తూ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్‌లో ఆహారభద్రత, ఆరోగ్యం, విద్య తదితర కీలక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోనున్నాయి. 

90 రోజుల పాటు పలు దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసే పాలసీలో భాగంగా బంగ్లాదేశ్‌కు సాయం నిలిపివేశారు. ఈజిప్ట్‌, ఇజ్రాయెల్‌లకు తప్ప ఇతర అన్ని దేశాలకు 90 రోజులపాటు అమెరికా సాయాన్ని నిలిపివేశారు. 

ట్రంప్‌ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వలసదారుల విధానాలు, ఫెడరల్‌ వర్కర్లు ఆఫీసు నుంచి విధులు నిర్వహించడం, లేకెన్‌ రిలే చట్టం అమలు, పారిస్‌ ఒప్పందం నుంచి తప్పుకోవడం వంటి నిర్ణయాలు వీటిలో ఉన్నాయి.

వీటికి తోడు అమెరికాలో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడం కోసం ‍ ప్రపంచంలోని ఇతర దేశాలకు సాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ట్రంప్‌ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

ఇదీ చదవండి: 90 వేల మంది ఉద్యోగుల తొలగింపు..ట్రంప్‌ కఠిన నిర్ణయం 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)