Breaking News

జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం.. ట్రంప్‌ కీలక ప్రకటన

Published on Wed, 07/23/2025 - 07:22

వాషింగ్టన్: జపాన్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర ప్రకటన చేశారు. టోక్యో తమతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించిందని, దీని ప్రకారం జపాన్ వస్తువులపై అమెరికా 15 శాతం సుంకం విధిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో ఈ ఒప్పందానికి జపాన్‌ అంగీకరించకపోతే ఆగస్టు ఒకటి నుండి 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

జపాన్‌తో ఒప్పందంపై ట్రంప్ మాట్లాడుతూ అమెరికా, జపాన్‌లు పరస్పరం 15 శాతం ఒప్పందపు రేటుతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నారు. ఈ ఒప్పందం ప్రకారం తన ఆదేశాల మేరకు జపాన్.. అమెరికాలో 550 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని, ఫలితంగా ఆ దేశం 90 శాతం లాభాలను పొందుతుందని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాము జపాన్‌తో ఒక భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, బహుశా ఇప్పటివరకు అమెరికాతో ఆ దేశం చేసుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో రాశారు.
 

అయితే ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ట్రంప్‌ వెల్లడించలేదు. కానీ ఈ ఒప్పందం లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ట్రంప్‌ తెలియజేశారు. కార్లు, ట్రక్కులు, బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి గేట్లు తెరుచుకుంటాయని, ఇకపై అమెరికాకు జపాన్  15 శాతం పరస్పర సుంకాలను చెల్లిస్తుందన్నారు. ఆగస్టు  ఒకటి వరకూ విధించిన గడువుకు ముందే వరుస ఒప్పందాలను కుదుర్చుకుంటామని గతంలో పేర్కొన్న ట్రంప్‌ ప్రస్తుతం అదేపనిలో తలమునకలై ఉన్నారు. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బ్రిటన్ వియత్నాంతో ఇటీవలే ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇప్పుడు జపాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్‌ ప్రకటించారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు