Breaking News

మిత్ర దేశమే..కానీ టారిఫ్‌లే

Published on Fri, 03/21/2025 - 04:11

వాషింగ్టన్‌:  ఇండియాతో తమకు చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. కానీ, ఇండియాలో టారిఫ్‌లు అధికంగా విధిస్తున్నారని మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఉందని, ఆ దేశంతో అదే ఏకైక సమస్య అని పేర్కొన్నారు. విదేశీ ఉత్పత్తులపై ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి టారిఫ్‌లు వసూలు చేయబోతున్నట్లు ట్రంప్‌ పునరుద్ఘాటించారు.

ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అమెరికా ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల ఉత్పత్తులపైనా తాము అలాంటి చర్య తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అమెరికా–ఇండియా సంబంధాలపై చర్చించారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియాలో సుంకాలను క్రమంగా తగ్గిస్తారన్న విశ్వాసం తనకు ఉందని వ్యాఖ్యానించారు. ఇండియాతో తనకున్న ఏకైక సమస్య ఆ విధంగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇండియాలో అమెరికా ఉత్పుత్తులపై ఎలాంటి టారిఫ్‌లు ఉన్నాయో ఏప్రిల్‌ 2 నుంచి ఇండియా ఉత్పత్తులపై తమ దేశంలో అలాంటి టారిఫ్‌లే అమల్లోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌–యూరప్‌–ఎకనామిక్‌ కారిడార్‌(ఐమెక్‌)ను సానుకూల చర్యగా అభివర్ణించారు. ఇది అద్భుతమైన దేశాల కూటమి అని చెప్పారు. వ్యాపారం, వాణిజ్యంలో దెబ్బతీయాలని చూస్తున్న ప్రత్యర్థి దేశాలకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. తమ శత్రువులను మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. వారికి ఎలాంటి మర్యాద చేయాలో తమకు బాగా తెలుసని డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టంచేశారు. మిత్రుల కంటే శత్రువులపైనే ఎక్కువగా దృష్టి పెడతామన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)