దేవుడే నన్ను రక్షించాడు: డొనాల్డ్‌ ట్రంప్‌

Published on Thu, 09/19/2024 - 10:45

న్యూయార్క్‌: తనను హత్య చేసేందుకు జరిగే ప్రయత్నాలను దేవుడు అడ్డుకొని రక్షించాడని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లిక్‌ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్‌  డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. తనపై జరిగిన దాడులను విఫలం చేసిమరీ దేవుడు కాపాడాడని పేర్కొన్నారు. ట్రంప్‌ న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలాండ్‌లో నిర్వహించిన ఎన్నికల  ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

‘నాపై జరిగిన హత్యా ప్రయత్నాలను దేవుడే విఫలం చేసి నన్ను బతికించాడు. అందుకే మళ్లీ మన దేశంలోకి మతాన్ని తిరిగి తీసుకురాబోతున్నాం. సుమారు 40 ఏళ్లలో న్యూయార్క్ స్టేట్‌ను గెలుచుకున్న మొదటి రిపబ్లికన్ అభ్యర్థి తానే అవుతాను. ఈ దాడులు నా సంకల్పాన్ని మరింత దృఢపరిచాయి. హత్యచేసే ప్రయత్నాలు నా సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేవు. నేను ఇక్కడకు రావడానికి కారణం.. ఈసారి ఎన్నికల్లో మనం న్యూయార్క్‌ను గెలవబోతున్నాం. చాలా ఏళ్ల తర్వాత రిపబ్లికన్‌లు నిజాయితీగా చెప్పడం ఇదే తొలిసారి. మనం గెలిచి చూపించబోతున్నాం. 

న్యూయార్క్ ప్రజలకు నేను ఒక్కటే చెబుతున్నా.. ఇక్కడ రికార్డు స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. తీవ్రవాదులు, నేరస్థులు పెరుగుతున్నారు. ద్రవ్యోల్బణం ప్రజలన ఇబ్బందులకు గురిచేస్తుంది.వాటి నుంచి బారినుంచి బయటపడాలంటే డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయండి’ అని అన్నారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్‌ దేవుడు, మతంపై వంటి అంశాల మీద చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక.. ఇటీవల ట్రంప్ ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌లోని గోల్ఫ్‌ ఆడుతుండగా.. ఓ దుండగుడు కాల్పులు జరపడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సర్వీసెస్‌ అప్రమత్తమైన ఆయన్ను రక్షించిన విషయం తెలిసిందే.

 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)