‘బ్రిక్స్‌’ దేశాలపై ట్రంప్‌ సెటైర్లు

Published on Fri, 02/21/2025 - 09:33

వాషింగ్టన్‌:‘బ్రిక్స్‌’ కూటమి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 150 శాతం సుంకాల దెబ్బకు ‘బ్రిక్స్‌’ ముక్కలయ్యాయని సెటైర్లు వేశారు. డాలర్‌ను ఆధిక్యతను దెబ్బతీయాలని ప్రయత్నించినందుకు ఆ దేశాలకు ఇది జరగాల్సిందేనన్నారు.

‘డాలర్‌ను నాశనం చేయాలని బ్రిక్స్‌ దేశాలు ప్రయత్నించాయి. ఆ దేశాలన్నీ కలిసి కొత్త కరెన్సీని తీసుకురావాలన్న ఆలోచన చేశాయి. నేను గెలవగానే ఆ దేశాలకు ఒకటే స్పష్టం చేశాను. డాలర్‌ ఆధిక్యతను దెబ్బతీయాలని చూస్తే మీ వస్తువులపై 150 శాతం సుంకం విధిస్తానని చెప్పాను.

మీ వస్తువులు మాకు అవసరం లేదు. నా దెబ్బకు బ్రిక్స్‌ దేశాలు ముక్కలయ్యాయి’అని ట్రంప్‌ అన్నారు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో భారత్‌కు కూడా మినహాయింపు ఇవ్వలేదు.బ్రిక్స్‌ కూటమిలో భారత్‌,రష్యా,చైనా సహా మొత్తం పది దేశాలున్నాయి.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)