Breaking News

భారత్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌

Published on Wed, 12/18/2024 - 07:06

వాషింగ్టన్‌ : డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అధిక సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే మేం కూడా భారత్‌ ఉత్పత్తులపై 100శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు.

డొనాల్డ్ ట్రంప్ కామర్స్‌ సెక్రటరీగా హోవార్డ్ లుట్నిక్‌ను ఎంపిక చేయడంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా-చైనా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, అమెరికా ఉత్పత్తులపై విదేశాలు విధిస్తున్న ట్యాక్స్‌  సంబంధిత అంశాలపై చర్చించారు.  

ట్రంప్‌ మాట్లాడుతూ.. పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై ట్యాక్స్‌లు విధిస్తున్నాయి. కానీ మేం ఆయా దేశాల వస్తువులపై ట్యాక్స్‌ విధించడం లేదు. ఇకపై అలా కుదరదు. వాళ్లు మా దేశ ఉత్పత్తులపై ట్యాక్స్‌ విధిస్తే మేం కూడా వారి దేశానికి చెందిన వస్తువులపై పన్ను విధిస్తాం. అధిక మొత్తంలో పన్నులు విధించే జాబితాలో బ్రెజిల్‌,  భారత్‌లు ఉన్నాయి.  

భారత్‌,బ్రెజిల్‌ తమ ఉత్పత్తులపై 100శాతం సుంకం విధిస్తే, ప్రతిఫలంగా అమెరికా కూడా అదే చేస్తుంది. అమెరికాకు చెందిన ఏదైనా ఓ ఉత్పత్తిపై రూ.100 నుంచి రూ.200 వరకు భారత్‌,బ్రెజిల్‌లు వసూలు చేస్తున్నాయి. మేం కూడా అదే స్థాయిలో వసూలు చేయబోతున్నామని డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు.

ట్రంప్‌కు కెనడా హెచ్చరికలు 
ఇప్పటికే ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ వస్తువులపై టారిఫ్‌ విధిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తమ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై ట్రంప్‌ టారీఫ్‌లు విధిస్తే.. చివరకు వారు కొనే ప్రతి వస్తువు ధరను పెంచుతుందని అమెరికా ప్రజలే అర్థం చేసుకొంటున్నారని కెనడా ప్రధాని ట్రూడో హెచ్చరించారు. హాలీఫాక్స్‌ ఛాంబరాఫ్‌ కామర్స్‌ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కెనడాపై ట్రంప్‌ అదనపు సుంకాలు విధిస్తే.. తాము ప్రతిచర్యలకు దిగుతామని ట్రూడో హెచ్చరించారు. అమెరికాలో ట్రంప్‌ గత కార్యవర్గంతో పోలిస్తే.. కొత్త బృందంతో డీల్‌ చేయడం కొంచెం సవాళ్లతో కూడిన పనిగా ఆయన అభివర్ణించారు. 2016లో స్పష్టమైన ఆలోచనలతో వారు చర్చలకొచ్చారన్నారు. 
 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)