Breaking News

ట్రంప్‌ సంచలనం.. రెండు వేల మంది ఉద్యోగులు అవుట్‌

Published on Mon, 02/24/2025 - 08:53

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు పెంచారు. ముందు చెప్పినట్లుగానే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే పనిని మొదలుపెట్టారు. ఓ వైపు ప్రపంచ దేశాలకు అమెరికా నుంచి అందే సాయాన్ని నిలిపివేసిన ట్రంప్‌ తాజాగా రెండు వేల మంది ‘యూఎస్‌ ఎయిడ్’ డిపార్ట్‌మెంట్‌‌ ఉద్యోగులపై వేటు వేశారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొద్ది మందిని మినహాయించి మిగిలిన వారికి బలవంతపు సెలవులు ప్రకటించారు.

ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్‌ జడ్జి అనుమతించిన తర్వాత యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగులపై వేటు విషయంలో  ట్రంప్‌ యంత్రాంగం ముందుకెళ్లింది. తమ తొలగింపు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి కార్ల్‌ నికోలస్‌ తిరస్కరించారు. అమెరికా నుంచి ప్రపంచంలోని పలు దేశాలకు యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా సాయం అందుతూ ఉంటుంది.

ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఖర్చు తగ్గించేందుకు డిసైడ్‌ అయ్యారు. ఇందులో భాగంగానే బిలియనీర్‌ ఇలాన్‌ మస్క్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ(డీవోజీఈ)ని ఏర్పాటు చేశారు.

తాజాగా అమెరికా ఫెడరల్‌ ఉద్యోగులకు గత వారం ఏం చేశారో చెప్పాలని, లేదంటే రాజీనామా చేయాలని డీవోజీఈ నుంచి వెళ్లిన మెయిళ్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మెయిళ్లకు సోమవారం అర్ధరాత్రిలోగా సమాధానమివ్వాలని ఉద్యోగులకు డెడ్‌లైన్‌ విధించారు.
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)