Breaking News

ట్రంపరితనం.. 30 దేశాల్లో రాయబారుల తొలగింపు

Published on Tue, 12/23/2025 - 01:43

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 30 దేశాల్లోని రాయబారుల్ని, ఇతర సీనియర్‌ స్థాయి అధికారుల్ని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బదులుగా వారి స్థానంలో వేరే వారిని నియమించనున్నారు. తొలగించిన రాయబారులు, ఇతర రాయబార కార్యాలయం సీనియర్‌ స్థాయి సిబ్బందిని వేరే విభాగాల్లో విధులు అప్పగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.   

విదేశాల్లో అమెరికన్ పౌరులను రక్షించడం, విదేశీ వ్యవహారాలపై అధ్యక్షుడికి సలహా ఇవ్వడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం  వంటి విభాగాల కిందకు వచ్చే స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఇది సాధారణ సిబ్బంది మార్పులలో భాగమేనని చెబుతున్నప్పటికీ.. ట్రంప్ ప్రభుత్వం దీన్ని అమెరికన్‌ ఫస్ట్ విధానంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ప్రయోజనాలను కాపాడేలా లక్ష్యంతో కొత్త రాయబారులను నియమించాలన్న ఉద్దేశమేని తెలిపింది.

ప్రభావిత దేశాలు

  • ఆఫ్రికా: అత్యధికంగా ప్రభావితమైన ఖండం. బురుండి, కామెరూన్, కేప్ వెర్డే, గాబోన్, ఐవరీ కోస్ట్, మడగాస్కర్, మారిషస్, నైజర్, నైజీరియా, రువాండా, సెనెగల్, సోమాలియా, ఉగాండా ఇలా మొత్తం 13 దేశాల్లో రాయబారులు తొలగింపుకు గురయ్యారు. 

  • ఆసియా: ఫిజీ, లావోస్, మార్షల్ దీవులు, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, వియత్నాం -ఆరుదేశాలు 

  • యూరప్: ఆర్మేనియా, మాసిడోనియా, మోంటెనెగ్రో, స్లోవేకియా -నాలుగు దేశాలు 

  • మధ్యప్రాచ్యం: అల్జీరియా, ఈజిప్ట్ – 2 దేశాలు.

  • ఇతర దేశాలు: నేపాల్, శ్రీలంక, గ్వాటెమాలా, సురినామ్‌లు ఉన్నారు. 

ఈ రాయబారులందరూ జో బైడెన్‌ పాలనలో నియమితులయ్యారు. అయితే, తాజాగా తొలగింపుల నేపథ్యంలో ట్రంప్‌.. వీరిందని తొలగించే లక్ష్యంగా బుధవారం అధికారికంగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో పేర్కొన్న దేశాల్లో నిరాయబారుల వెనక్కి రావాలని ప్రకటించారు. సాధారణంగా రాయబారులు 3–4 సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు. అయితే, వారు అధ్యక్షుడి ఇష్టప్రకారం పనిచేస్తారు. తొలగింపుకు గురైన వారు తమ ఫారిన్ సర్వీస్ ఉద్యోగాలను కోల్పోవడం లేదు. అమెరికాకు తిరిగి వచ్చి ఇతర విభాగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ నిర్ణయం వల్ల అమెరికా విదేశాంగ విధానంలో పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆసియా, యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల్లో అమెరికా సంబంధాలు కొత్త రూపం దాల్చే అవకాశం ఉంది. బైడెన్ పాలనలో ఏర్పడిన కొన్ని ఒప్పందాలు మారే అవకాశం ఉంది.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)