Breaking News

భలే ఇంగ్లిష్‌ మీది! 

Published on Fri, 07/11/2025 - 05:32

వాషింగ్టన్‌: ఏదో ఒక వివాదం లేనిదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పొద్దుపోవడం లేదు. తాజాగా లైబీరియా అధ్యక్షుడు జోసెఫ్‌ బొవాకై ఇంగ్లిష్‌ చాలా బాగుందంటూ ఆయన ఇచి్చన కితాబు కూడా వివాదానికే దారితీసింది. బుధవారం వైట్‌హౌస్‌లో ఐదుగురు ఆఫ్రికా దేశాధినేతలతో భేటీ సందర్భంగా జోసెఫ్‌ ఇంగ్లిష్ కు ట్రంప్‌ ముగ్ధుడయ్యారు. ‘‘చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంత చక్కని ఇంగ్లిష్‌ ఎక్కడ నేర్చుకున్నారు?’’అంటూ ఆరా తీశారు. 

ఆయన ధోరణి తమను అవమానించేలా ఉందంటూ లైబీరియాలోనే గాక ఆఫ్రికావ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ఆఫ్రికా ప్రాంతాలవాళ్లు నిరక్షర కుక్షులనే ఉద్దేశంలోనే ట్రంప్‌ వ్యాఖ్యలున్నాయని మండిపడుతున్నారు. దీనిపై లైబీరియా దౌత్యవేత్తలు కూడా అభ్యంతరం వెలిబుచ్చారు. ట్రంప్‌ తీరుకు నిరసనగా తమ అధ్యక్షుడు వాకౌట్‌ చేయాల్సిందని లైబీరియన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే వైట్‌హౌస్‌ ప్రెస్‌ కరోలినా లెవిట్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను సమరి్థంచారు. వాటిలో తప్పేమీ లేదని, తమ అధ్యక్షుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని లైబీరియా విదేశాంగ మంత్రి కూడా అన్నారు. 

ఆంగ్లమే అధికార భాష 
లైబీరియా అధికారిక భాష ఇంగ్లిష్. ఆఫ్రికాలో బానిసత్వం నుంచి విముక్తి పొందిన వారి పునరావాసం నిమిత్తం అమెరికా వలస సమాజం 1822లో ఆ దేశాన్ని ఏర్పాటు చేసింది. 1847లోనే అమెరికా నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది. ఆంగ్లంతో పాటు అక్కడ పలు భాషలు మాట్లాడతారు. గతంలో జర్మనీ చాన్సలర్‌ ఫ్రెడెరిక్‌ మెర్జ్‌ ఇంగ్లిష్ నుకూడా ట్రంప్‌ ఇలాగే మెచ్చుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ‘అమెరికా ఫస్ట్‌’నినాదంతో భాగంగా ఆంగ్లానికి ఆయన అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దాన్ని అమెరికా అధికార భాషగా గుర్తిస్తూ గత మార్చిలో ఉత్తర్వులు కూడా ఇచ్చారు! 
 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)