ట్రంప్‌ దెబ్బ అదుర్స్‌.. బైడెన్‌పై ప్రతీకారం

Published on Sun, 03/23/2025 - 08:45

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకారం తీర్చుకున్నారు. ఆయనకు సెక్యూరిటీ క్లియరెన్స్‌ హోదాను రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, హిల్లరీ క్లింటన్‌తో పాటు బైడెన్‌ కుటుంబీకులకు, ఆయన యంత్రాంగంలో మంత్రులుగా, ఉన్నతాధికారులుగా పని చేసిన పలువురికి కూడా ఈ క్లియరెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

మాజీ అధ్యక్షులు, మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారులకు సెక్యూరిటీ క్లియ రెన్స్‌ను కొనసాగించడం ఆనవాయితీ. ఈ హోదా ఉండేవారికి వారికి ప్రభుత్వ నిఘా సమాచారం అందుతుంది. రహస్య పత్రాలు తదితరాలను చూసేందుకు కూడా వారికి అనుమతి ఉంటుంది. 2021లో బైడెన్‌ గద్దెనెక్కగానే ట్రంప్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్‌ తొలగించారు. 2016–20 మధ్య అధ్యక్షుడైన ట్రంప్‌ ఆ ఎన్నికల్లో బైడెన్‌ చేతిలో ఓడటం, దాన్ని జీర్ణించుకోలేక క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి తనవారిని ఉసిగొల్పడం తెలిసిందే.

ఈ క్రమంలోనే.. బైడెన్‌.. ‘తప్పుడు ప్రవర్తతో కూడిన ట్రంప్‌ వంటి వ్యక్తికి రహస్య, నిఘా సమాచారం అందుబాటులో ఉండటం సరికాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా’ అని చెప్పారు. తాజాగా ట్రంప్‌ కూడా తన నిర్ణయానికి సరిగ్గా అవే కారణాలను చూపడం విశేషం. ‘రహస్య పత్రాలు, సమాచారం బైడెన్‌ తదితరులకు అందుబాటులో ఉండటం దేశ ప్రయోజనాల రీత్యా క్షేమకరం కాదన్న నిర్ణయానికి వచ్చాను. అందుకే ఈ మేరకు ఆదేశాలిస్తున్నా’ అంటూ ప్రకటించారు!.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)