Breaking News

డీఈఏ చీఫ్‌ పదవి నాకొద్దు: క్రోనిస్టర్‌

Published on Thu, 12/05/2024 - 05:36

ఫ్లోరిడా: అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీఈఏ) అధిపతి పదవి చేపట్టబోవడం లేదని చాడ్‌ క్రోనిస్టర్‌ ప్రకటించారు. ఫ్లోరిడాలోని హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్‌ పదవిలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ‘‘షెరీఫ్‌గా చేయాల్సింది చాలా ఉంది. అందుకే డీఈఏ పదవి చేపట్టొద్దని నిర్ణయించుకున్నా’’అంటూ తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గానీ, ఆయన బృందం గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

మెక్సికో సరిహద్దు వెంబడి ఫెంటానిల్‌ అక్రమ ప్రవాహాన్ని నిరోధించేందుకు డీఈఏ చీఫ్‌గా క్రోనిస్టర్‌ను నామినేట్‌ చేస్తున్నట్టు ట్రంప్‌ ఆదివారమే ప్రకటించారు. న్యాయ శాఖలో స్టిస్‌లో భాగంగా పనిచేసే డీఈఏ డ్రగ్‌ చట్టాలను అమలు చేస్తుంది. 2020 కోవిడ్‌ సమయంలో ప్రజారోగ్య ఆదేశాలను విస్మరించారనే అభియోగంపై ఒక పాస్టర్‌ను అక్రమంగా అరెస్టు చేయడం వంటి పలు అభియోగాలు, విమర్శలు క్రోనిస్టర్‌పై ఉన్నాయి. అటార్నీ జనరల్‌గా ట్రంప్‌ నామినేట్‌ చేసిన మాట్‌ గేట్జ్‌ కూడా తనకా పదవి వద్దని ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. 

రక్షణ మంత్రిగా నామినేట్‌ చేసిన పీట్‌ హెగ్సెత్‌ విషయంలో కూడా ట్రంప్‌ తాజాగా పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. లైంగిక వేధింపులతో పాటు ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. తాజాగా హెగ్సెత్‌ తల్లి కూడా ఆయనపై పలు ఆరోపణలు చేశారు! ఈ నేపథ్యంలో ఆయన నియామకానికి సెనేట్‌ ఆమోదం కష్టమేనని ట్రంప్‌ బృందం భావిస్తోంది. అందుకే హెగ్సెత్‌ స్థానంలో రక్షణ మంత్రిగా ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యరి్థత్వం కోసం ఆయన ట్రంప్‌తో పోటీ పడ్డారు.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)