Breaking News

ట్రంప్‌ భారత్‌కు వచ్చే అవకాశాల్లేవు

Published on Sun, 08/31/2025 - 05:15

న్యూయార్క్‌: భారత్‌లో ఈ ఏడాది చివర్లో జరిగే క్వాడ్‌ శిఖరాగ్రానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే అవకాశాలు లేవని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. గత కొద్ది నెలలుగా ప్రధాని మోదీ, ట్రంప్‌ మధ్య సంబంధాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఆ పత్రిక ఓ కథనంలో ఈ మేరకు విశ్లేషించింది. దీనిపై అమెరికా, భారత్‌ అధికారులు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. 

నవంబర్‌లో భారత్‌ ఆతిథ్యంలో జరిగే శిఖరాగ్రంలో ఆ్రస్టేలియా, జపాన్, అమెరికా దేశాల నేతలు పాల్గొనాల్సి ఉంది.  భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య కొనసాగిన నాలుగు రోజుల సంక్షోభం తన జోక్యంతోనే ముగిసిందంటూ ట్రంప్‌ పదేపదే చెప్పుకోవడం, భారత్‌ ఖండించడాన్ని న్యూయార్క్‌టైమ్స్‌ కథనంలో ప్రస్తావించింది. దీనిపై ట్రంప్‌ విషయంలో మోదీ సహనం కోల్పోయారని వ్యాఖ్యానించింది. 

పాకిస్తాన్‌ తనను నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేయడాన్ని ప్రస్తావించిన ట్రంప్‌..భారత్‌ కూడా అలాగే చేయాలని ఆశించి భంగపడ్డారని విశ్లేషించింది. ఇదే ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచేందుకు ఆజ్యం పోశాయని పేర్కొంది. 

వీటికి ప్రతీకారంగానే రష్యా ఆయిల్‌ కొనుగోలు సాకుతో భారత్‌పై విపరీతంగా టారిఫ్‌ల భారం మోపారని తెలిపింది. టారిఫ్‌లపై చర్చలు కొలిక్కి రాకపోయేసరికి విసుగెత్తిన ట్రంప్‌ పలుమార్లు మోదీకి ఫోన్‌ చేసినా ఆయన స్పందించలేదని పేర్కొంది. అందుకే, భారత్‌–అమెరికాల మధ్య సంబంధాలు దిగజారడానికి రష్యా ఆయిల్‌ కొనుగోలు చేయడానికి మించిన కారణాలున్నట్లు విశ్లేషకులు సైతం అంటున్నారని ఆ కథనం వివరించింది.  
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు