Breaking News

మనోళ్లపై మరో పిడుగు

Published on Tue, 04/15/2025 - 05:36

ట్రంప్‌ సర్కారు భారతీయులను నానాటికీ మరింతగా లక్ష్యం చేసుకుంటోంది. వారిని వేధించేలా రోజుకో తరహా నిబంధనలు తీసుకొస్తోంది. హెచ్‌–1బీ వీసాలు, గ్రీన్‌కార్డులు ఆశావహుల కలలపై నీళ్లు చల్లేలా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయ్‌మెంట్‌ బేస్డ్‌ పిఫ్త్‌ ప్రిఫరెన్స్‌ (ఈబీ–5) అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీ కింద వాటికోసం దరఖాస్తు చేసుకునేందుకు కటాఫ్‌ను ఆర్నెల్ల పాటు తగ్గించింది. దాన్ని 2019 నవంబర్‌ 1 నుంచి 2019 మే 1కి మార్చింది. ఈబీ–5 కేటగిరీలో భారతీయుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉందన్న సాకుతో ఈ నిర్ణయం తీసుకుంది.

 మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్‌లో అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ మేరకు పేర్కొంది. దాంతో చాలామంది భారతీయులు ఈబీ–5 కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు! నెలవారీ బులెటిన్‌లో విదేశాంగ శాఖ పేర్కొనే ‘తుది కార్యాచరణ తేదీ’లు చాలా కీలకం. వీసా/గ్రీన్‌కార్డు దరఖాస్తును ప్రాసెసింగ్‌ నిమిత్తం యూఎస్‌ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్‌ సరీ్వసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) పరిగణనలోకి తీసుకోవాలంటే అవి బులెటిన్‌లో పేర్కొన్న తేదీ కంటే ముందువి అయ్యుండాలి. చైనాకు మాత్రం ఈబీ–5 కటాఫ్‌ను మార్చకపోవడం విశేషం. 

ఏమిటీ ఈబీ–5 కేటగిరీ? 
అర్హులైన వలస ఇన్వెస్టర్లకు అమెరికాలోని గ్రామీణ, హెచ్చు నిరుద్యోగ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించేందుకు ఈబీ–5 కేటగిరీని అమెరికా తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా అన్‌ రిజర్వుడ్‌ విభాగం కింద దరఖాస్తు చేస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దాంతో అందుబాటులో ఉండే వీసాల తగ్గిపోతోంది. భారతీయులకు ఈబీ–5 కటాఫ్‌ తగ్గింపు వల్ల అర్హుల జాబితా నుంచి చాలామంది గల్లంతవుతారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)