Breaking News

Video: మెక్​డొనాల్డ్స్‌లో ఫ్రెంచ్​ ఫ్రైస్​ చేసిన ట్రంప్‌.. మస్క్‌ రియాక్షన్‌

Published on Mon, 10/21/2024 - 10:53

మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌. రిపబ్లికర్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ సాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రత్యర్థుల బలహీనతలను ఎత్తిచూపుతూ, చిత్రవిచిత్ర ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు

తాజాగా రిపబ్లికెన్​ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని ఓ మెక్​డొనాల్డ్స్​ ఓట్‌లెట్‌లో కొంతసేపు పనిచేశారు. తెలుపు రంగు షర్ట్‌ మీద బ్లాక్‌ అండ్‌ ఎల్లో డ్రెస్‌కోడ్‌ ధరించి ఫ్రెంచ్​ ఫ్రైస్ తయారు​ చేశారు. ఇక వీటిని ట్రంప్ తన మద్దతుదారులలో కొందరికి  అందించారు.

ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ఈ పని తనకెంతో నచ్చిందని, ఇక్కడ పనిచేయడం సరాదాగా ఉందని తెలిపారు. తానెప్పటి నుంచో మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేయాలనుకుంటున్ననని పేర్కొన్నారు. అయితే తాను యుక్త వయసులో ఉన్న సమయంలో మెక్డీలో పనిచేశానని ప్రచారాలు చేస్తున్న డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ట్రంప్​ ఈ విధంగా కౌంటర్​ ఇచ్చారు. ఆమె కంటే 15నిమిషాలు ఎక్కువ పనిచేశానని ప్రత్యర్థి కమలా హారిస్‌పై విమర్శలు గుప్పించారు

ఇక ట్రంప్‌ డొనాల్డ్స్‌లో పనిచేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అక్టోబర్‌ 20న కమలా హారిస్‌ 60వ పుట్టినరోజు. దీనిపై ట్రంప్‌ మాట్లాడుతూ..ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కమలకు కొన్ని పువ్వులు ఇస్తాననని అదే విధంగా తాను తయారు చేసిన ఫ్రైస్‌ కూడా ఇస్తానని చమత్కరించారు.

ట్రంప్‌ వీడియో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  స్పందించారు. అద్భుతమైన వీడియో అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో మస్క్‌ ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఓటింగ్‌ను ట్రంప్‌కు అనుకూలంగా మార్చేందుకు అమెరికన్లకు  తాయిలాలు  ప్రకన్నారు. ఈ   క్రమంలో పెన్సిల్వేనియాలో శనివారం నుంచి రిజిస్టర్డ్‌ ఓటర్ల నుంచి రోజూ డ్రా తీసి ఎంపికైన ఓటరుకు దాదాపు రూ.8.4 కోట్లు అందజేస్తామని చెప్పారు. నవంబర్‌ 5 ఈ లాటరీ కొనసాగుతుందన్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)