శాంతి మండలిపై ట్రంప్‌ కొత్త రాగం..

Published on Sat, 01/24/2026 - 07:01

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: అంతర్జాతీయ వేదికపై కొత్తగా శాంతి మండలి ఆవిర్భావం ఐక్యరాజ్యసమితికి కూడా మేలు చేసే అంశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఐరాస తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఫలితాలు సాధించడంలో విఫలమైందని ఆక్షేపించారు. గురువారం దావోస్‌ నుంచి అమెరికా తిరిగి వెళ్తూ ఎయిర్‌ఫోర్స్‌వన్‌ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ..‘గాజాలో శాంతి స్థాపనకు మాత్రమే కాదు, అంతకుమించి కూడా మరెన్నో అంశాల్లో ఐరాసతో కలిసి గొప్పగా పని చేస్తాం. ఒక సంస్థగా ఐరాసకు ఉన్న సామర్థ్యం అంతా ఇంతా కాదు. కానీ అందుకు తగ్గట్టుగా పని చేయడంలో, ఫలితాలు సాధించడంలో ఐరాస విఫలమైంది. నేను ఏకంగా ఎనిమిది యుద్ధాలు ఆపాను. కానీ దీని గురించి ఐరాసతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు’ అన్నారు.

దీనిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫన్‌ డుజారిక్‌ స్పందించారు. ‘ట్రంప్‌ ప్రకటనలు (శాంతి మండలిని ఉద్దేశిస్తూ) చూశాం. అయితే సార్వత్రిక సభ్యత్వమున్న ఏకైక అంతర్జాతీయ సంస్థ ఐరాసే’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి దిశగా తమ కృషి, ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. గాజాలో అత్యధిక పరిమాణంలో మానవతా సాయాన్ని పంచింది ఐరాస మాత్రమేనని స్టీఫన్‌ గుర్తు చేశారు.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)